ఎక్కడున్నా పట్టేస్తుంది

కుర్రకారుకి కంగారు ఎక్కువ. ఫోన్‌, బ్యాక్‌ప్యాక్‌, వ్యాలెట్‌లాంటి విలువైన వస్తువులు ఎక్కడెక్కడో పెట్టి మర్చిపోతుంటారు.

Published : 26 Jun 2021 00:30 IST

ధర: రూ.2 వేలు

కుర్రకారుకి కంగారు ఎక్కువ. ఫోన్‌, బ్యాక్‌ప్యాక్‌, వ్యాలెట్‌లాంటి విలువైన వస్తువులు ఎక్కడెక్కడో పెట్టి మర్చిపోతుంటారు. తర్వాత నానా హైరానా పడిపోతారు. ఫోన్‌ అయితే కాల్‌ చేసి ఎక్కడుందో తెలుసుకోవచ్చు. మరి మిగతా వాటి సంగతేంటి? యాపిల్‌ కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చిన కీ చైన్‌లాంటి ‘ఎయిర్‌ ట్యాగ్‌’తో ఆ వస్తువులు ఎక్కడున్నా పట్టేయొచ్చు. ఇదో చిన్న ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌. ఫైండ్‌ మై యాప్‌ ద్వారా ఫోన్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. ఎయిర్‌ట్యాగ్‌ని మనం కావాలనుకున్న వస్తువుకి ముడి వేస్తే సరి. ఒకవేళ ఆ వస్తువు ఎక్కడైనా పెట్టి మర్చిపోతే ఫోన్‌లోని యాప్‌లో వెతుక్కోవచ్చు. సెన్సర్ల ఆధారంగా ఆ వస్తువు ఎక్కడుందో, ఎంత దూరంలో ఉందో దారి చూపిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని