ట్విటర్‌లో కొత్త మోజు

మీరెప్పుడైనా గమనించారా? ట్విటర్‌లో ‘ట్విటర్‌ క్రష్‌’ తరచూ ట్రెండింగ్‌ అవుతోంది. ఇది పక్కాగా మన యూత్‌కి సంబంధించిన ముచ్చటే.

Published : 03 Jul 2021 01:28 IST

మీరెప్పుడైనా గమనించారా? ట్విటర్‌లో ‘ట్విటర్‌ క్రష్‌’ తరచూ ట్రెండింగ్‌ అవుతోంది. ఇది పక్కాగా మన యూత్‌కి సంబంధించిన ముచ్చటే. వాళ్లూ వీళ్లూ అనే తేడా లేకుండా కుర్రకారు ఎవరైనా ఈ ధోరణికి సృష్టికర్తలుగా మారిపోతున్నారు. పుణె అమ్మాయి ఆయుస్మిత ‘నాకు ప్రభాస్‌ అంటే క్రష్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో పెట్టేసింది. ఆరోజు అదే ట్రెండింగ్‌. మీర్జాపూర్‌ వెబ్‌సిరీస్‌లో మున్నా త్రిపాఠీ ఘాటు డైలాగులకు మీమ్స్‌ జోడించి నవ్వులు పూయించాడు లఖ్‌నవూ కుర్రాడు. ఆరోజు అదే టాప్‌ అని వేరే చెప్పాలా? ‘అందరూ ప్రేమలో పడిపోవాలనే రూల్‌ ఏమైనా ఉందా, జంటగానే ఉంటారా.. నాలాగా సింగిల్‌గా ఎవరూ ఉండరా?’ అంటూ ప్రేమలో విఫలమైన ఓ అబ్బాయి దీనమైన ఓ ఫొటో జోడించి తన అక్కసునంతా 120 అక్షరాల్లో వెళ్లగక్కాడు. అదీ అందరినీ ఆకట్టుకుంది. ఇవేకాదు.. ప్రేమ, రాజకీయాలు, టెక్నాలజీ, గాసిప్స్‌, సినిమా తారలు, సోషల్‌ మీడియా.. టాపిక్‌ ఏదైనా తమ ఆలోచనలకు మీమ్స్‌ అద్ది.. అభిప్రాయాలకు ఫన్నీ ఫొటోలు జోడించి ఈ క్రష్‌ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు మన యూత్‌. వీళ్ల సృజనాత్మకతకి సీరియస్‌ విషయాలే మరుగున పడిపోయి ఈ హ్యాష్‌టాగ్‌లే ట్రెండింగ్‌ అయి కూర్చుంటున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని