సరిగమప.. ఒత్తిడి తీర్చునుగా...

బోర్‌ కొడితే చెవుల్లో ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకుంటారు. మనసు బాగోకపోతే పాడ్‌కాస్ట్‌ వింటారు. ఒత్తిడి ఎక్కువైతే మ్యూజిక్‌కి చెవులొగ్గుతారు. యువత ఇలాగే చేస్తోందట. మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ కంపెనీ స్పాటిఫై  నిర్వహించిన సర్వేలో మన మిలీనియల్స్‌, జనరేషన్‌ జెడ్‌ చెప్పిందిదే. మిగతా వివరాలు...

Published : 17 Jul 2021 01:37 IST

యువ నాది

బోర్‌ కొడితే చెవుల్లో ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకుంటారు. మనసు బాగోకపోతే పాడ్‌కాస్ట్‌ వింటారు. ఒత్తిడి ఎక్కువైతే మ్యూజిక్‌కి చెవులొగ్గుతారు. యువత ఇలాగే చేస్తోందట. మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ కంపెనీ స్పాటిఫై  నిర్వహించిన సర్వేలో మన మిలీనియల్స్‌, జనరేషన్‌ జెడ్‌ చెప్పిందిదే. మిగతా వివరాలు...

87శాతం మిలీనియల్స్‌, 77 శాతం జనరేషన్‌ జెడ్‌ సంగీతం ఒత్తిడిని తగ్గిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు.

* మ్యూజిక్‌ని మానసిక ఉల్లాసానికి మార్గంగా భావించడం.. గతేడాదితో పోలిస్తే మిలీనియన్స్‌లో 600శాతం, జనరేషన్‌ జెడ్‌లో 900 శాతం పెరిగింది.

* ఇష్టమైన సంగీతం విన్నప్పుడు మనసంతా సంతోషంతో నిండిపోతుందని మొత్తమ్మీద 80శాతం చెప్పారు.

* సంప్రదాయ సంగీత సాధనాలు, మీడియాకన్నా పాడ్‌కాస్ట్‌లు ఆధునికం, అనువైనవని 48శాతం మంది భావించారు.

* 55శాతం మిలీనియల్స్‌, 47శాతం జనరేషన్‌ జెడ్‌ తాము గ్లోబల్‌ కమ్యూనిటీలో భాగం అయిపోయామని భావిస్తున్నారు.

* 15 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులు 19వేల మందితో ఈ సర్వే నిర్వహించారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని