బద్ధకం.. బద్దలు కొడదాం

చదవాలంటే బద్ధకం. పని చేయాలంటే బద్ధకం. ఇది వ్యక్తిగత ఎదుగుదలకు బద్ధశత్రువని తెలిసినా యూత్‌లో చాలామంది దీన్ని వదిలించుకోలేపోతూనే ఉంటారు. జోష్‌కి చిరునామాగా ఉండే కుర్రకారు ఈ పదాన్ని డిక్షనరీ నుంచి ఎలా చెరిపేయాలి? ఇవిగోండి కొన్ని టిప్స్‌.

Published : 17 Jul 2021 01:37 IST

జరా సోచో

చదవాలంటే బద్ధకం. పని చేయాలంటే బద్ధకం. ఇది వ్యక్తిగత ఎదుగుదలకు బద్ధశత్రువని తెలిసినా యూత్‌లో చాలామంది దీన్ని వదిలించుకోలేపోతూనే ఉంటారు. జోష్‌కి చిరునామాగా ఉండే కుర్రకారు ఈ పదాన్ని డిక్షనరీ నుంచి ఎలా చెరిపేయాలి? ఇవిగోండి కొన్ని టిప్స్‌.

జర సోచోడెడ్‌లైన్‌: చూద్దాంలే.. చేద్దాంలే.. చాలామందిది ఇదే తీరు. దాన్ని పక్కన పెట్టండి. రొటీన్‌కి భిన్నంగా ప్రతిదానికీ ఓ డెడ్‌లైన్‌ పెట్టుకొని పని చేయండి. ఫలానా టైమ్‌కి చేసి తీరాల్సిందే అనుకోండి. కచ్చితంగా మెరుగవుతారు.
చిన్న లక్ష్యాలు: ఐఏఎస్‌ అయిపోవాలి.. కంపెనీని కోట్ల టర్నోవర్‌కి తీర్చిదిద్దాలి అనే పెద్ద లక్ష్యాలుండటం తప్పేం కాదు. వాటిని చిన్నచిన్న టార్గెట్లుగా విభజించుకోవాలి. ఈ సమయంలోగా ఇన్ని పుస్తకాలు చదివేయడం, ఫలానా ఏడాదికి ఇంత టర్నోవర్‌ సాధించడం.. ఇలా.

స్ఫూర్తిదాతలు: ఏ పనికైనా స్ఫూర్తినిచ్చే వ్యక్తిని తలచుకుంటే మంచిది. మన పక్క సీట్లో సూపర్‌గా పని చేసే సహోద్యోగి, క్యాంపస్‌లో మంచి జాబ్‌ కొట్టిన సీనియర్‌.. వీళ్లనే అనుక్షణం తలచుకుంటే బద్ధకం పరారవుతుంది.
బాధ అనుభవించాలి: దెబ్బ తగిలితే నొప్పిని అనుభవిస్తాం. బద్ధకంతో ఏమేం కోల్పోతామో ఆ బాధని సైతం గుర్తించాలి. చేతగానితనంతో ఏమేం నష్టపోతున్నామో మననం చేసుకోవాలి. కాగితంపై రాసుకోవాలి. మార్పు రావడం ఖాయం.

బహుమతి ఇచ్చుకుందాం: ఆరోజు పని సమయంలోగా ముగిస్తే ఓ ట్రీట్‌.. చిన్న టార్గెట్‌ పూర్తి చేస్తే  ఓ కొత్త చొక్కా.. చివరి లక్ష్యం చేరితే నచ్చిన సెల్‌ఫోన్‌.. ఇలా మనకు మనమే బహుమతులు ఇచ్చుకుంటే తప్పేం లేదు. మరింత ఉత్సాహంగా పని చేయడానికి మనకు మనమే ప్రేరణ అవుతాము.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని