ఇలా కూడా వెతుకుతారా?

గూగుల్‌.. కుర్రకారుకి పే..ద్ద గురువు. కడుపు నొప్పికి వేసుకునే మాత్ర నుంచి లవర్‌కి బ్రేకప్‌ చెప్పే చిట్కాల దాకా.. ఏదైనా మొహమాటం లేకుండా సలహాలిచ్చేస్తుంది. అందుకే మరి మనోళ్లు ఎడాపెడా అన్నీ సెర్చ్‌ చేసేస్తుంటారు. అందులో కొన్ని మరీ సిల్లీగా, నవ్వు తెప్పించేవిగా ఉంటాయి.

Published : 31 Jul 2021 05:07 IST

గూగుల్‌.. కుర్రకారుకి పే..ద్ద గురువు. కడుపు నొప్పికి వేసుకునే మాత్ర నుంచి లవర్‌కి బ్రేకప్‌ చెప్పే చిట్కాల దాకా.. ఏదైనా మొహమాటం లేకుండా సలహాలిచ్చేస్తుంది. అందుకే మరి మనోళ్లు ఎడాపెడా అన్నీ సెర్చ్‌ చేసేస్తుంటారు. అందులో కొన్ని మరీ సిల్లీగా, నవ్వు తెప్పించేవిగా ఉంటాయి. అర్రే.. ఇలా కూడా అడుగుతారా? అనిపిస్తుంటుంది. మచ్చుకు కొన్ని చూడండి...

* క్రెడిట్‌ కార్డు బిల్లులు ఎగ్గొట్టడం ఎలా?

*  మగాళ్లకి కడుపొస్తుందా?

*  రాత్రుళ్లు పక్క తడపకుండా ఏం చేయాలి?

*  గూగుల్‌ని హ్యాక్‌ చేయడమెలా?

*  బ్యాట్‌మన్‌కి, సూపర్‌మ్యాన్‌కి పోటీ పెడితే ఎవరు గెలుస్తారు?

*  ఒక్క రాత్రిలో మొత్తం సెమిస్టర్‌ చదివేయడం ఎలా?

*  గూగుల్‌ ఆడా? మగా?

*  సిటీ బస్సులో కనిపించిన అమ్మాయి ఫోన్‌ నెంబర్‌ దొరుకుతుందా?

*  రాత్రికి రాత్రే అంబానీ కావడమెలా?

*  ఇంట్లోనే కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారు చేయొచ్చా?

*  వారం రోజుల్లో అమ్మాయిని పడేయడం ఎలా?

*  శానిటైజర్‌ నుంచి ఆల్కహాల్‌ ఎలా తీయాలి?

- ఎస్‌.కిరణ్‌ కుమార్‌, ఈమెయిల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని