స్వర్ణాలు.. రజతాలు.. ట్రెండింగ్‌లు!
ఆటలు, యూత్‌ది విడదీయలేని బంధం. మరి ఒలింపిక్స్ అంటే.. ఆ ఊపు హై-వోల్టేజీలో ఉంటుంది. రేపటితో ఈ సంరంభం కూడా ముగుస్తోంది. మనం గెల్చిన పతకాల మాట అటుంచితే ఈ క్రీడల్ని ముడిపెడుతూ సామాజిక మాధ్యమాలు, అంతర్జాలంలో కొన్ని టాపిక్స్ బాగా ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇవిగోండి ఆ ముచ్చట్లు.
గో ఫర్ గోల్డ్: మన హాకీ అమ్మాయిలు సెమీఫైనల్ చేరగానే చిబ్నిన్నీ౯బ్నిః్ట హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు పోటెత్తాయి. 49 ఏళ్ల తర్వాత సెమీస్‌కి చేరి చరిత్ర సృష్టించిన మన సివంగులను ఉత్సాహపరచడానికి ట్విటర్ ఏకతాటిపైకి వచ్చింది.
పతకధారి అనూమాలిక్: టోక్యోలో ఇజ్రాయెల్ జిమ్నాస్ట్ ఒకరు తొలిసారి స్వర్ణపతకం నెగ్గాడు. మెడల్ అందుకునే సమయంలో ఆ దేశ జాతీయగీతం వినిపిస్తున్నప్పుడు అనూ మాలిక్ కంపోజ్ చేసిన ‘మేరా ముల్క్ మేరా దేశ్’ అనే పాట అందరికీ గుర్తొచ్చింది. ఎందుకంటే.. అది అచ్చంగా ఇజ్రాయెల్ జాతీయ గీతాన్నే పోలి ఉంది. అలా మనోడి ‘ప్రతిభ’ వెలుగులోకి వచ్చింది. మనోడికి కాపీ కొట్టడంలో స్వర్ణం దక్కింది.
మనోళ్లకి గోల్డ్ మెడల్స్: పోటీలు ముగుస్తున్నా మనకి స్వర్ణం రాలేదు. విసిగిపోయిన అభిమానులు అక్కసునంతా మీమ్స్ రూపంలో వెళ్లగక్కుతున్నారు. క్రీడాకారులకు బదులుగా రాజకీయ నాయకులు, హీరోలను పంపిస్తే డజన్లకొద్దీ బంగారు పతకాలు వచ్చేవి అంటూ ఫన్నీ మీమ్స్ కుమ్మరించేస్తున్నారు. బెస్ట్ రన్నర్, బెస్ట్ ఎకనామిస్ట్, రణ్‌బీర్‌సింగ్ విచిత్ర వేషధారణను బెస్ట్ డ్రెస్సింగ్ అంటూ రకరకాల మీమ్స్ తయారు చేసి సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs NZ: బ్యాటర్లకు ‘పిచ్’ ఎక్కించింది.. గింగిరాలు తిప్పిన బౌలర్లు
-
Politics News
Nara Lokesh: వడ్డెర సామాజిక వర్గానికి రాజకీయంగా అవకాశాలిస్తాం: నారా లోకేశ్
-
India News
SC: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
-
India News
Congress: చైనా విషయంలో కేంద్రానిది DDLJ వ్యూహం: కాంగ్రెస్ కౌంటర్
-
India News
Rahul Gandhi: మంచులో రాహుల్-ప్రియాంక ఫైట్.. వీడియో వైరల్
-
Movies News
Jayasudha: ఆ భయంతోనే అజిత్ సినిమాలో నటించలేదు: జయసుధ