మాట్లాడే మాస్క్‌

మాస్క్‌.. ఇప్పుడు కరోనాని అడ్డుకునే రక్షణ కవచమే కాదు.. ఓ ఫ్యాషన్‌ సింబల్‌ కూడా. కానీ దీన్ని అంతకుమించి ఓ గ్యాడ్జెట్‌లా మార్చేసింది MASKFONE...

Published : 21 Aug 2021 03:28 IST

మాస్క్‌.. ఇప్పుడు కరోనాని అడ్డుకునే రక్షణ కవచమే కాదు.. ఓ ఫ్యాషన్‌ సింబల్‌ కూడా. కానీ దీన్ని అంతకుమించి ఓ గ్యాడ్జెట్‌లా మార్చేసింది MASKFONE.

ఏంటి ప్రత్యేకత?
రక్షణ, సౌకర్యం, సొగసు, సాంకేతికత.. కలిపితే మా కొత్త మాస్క్‌ అంటోంది మాస్క్‌ఫోన్‌. ఇది మూడు పొరల మాస్క్‌ కమ్‌ గ్యాడ్జెట్‌. సాధారణంగా ఫోన్‌ మాట్లాడేటప్పుడో, మ్యూజిక్‌ వింటున్నప్పుడో మాస్క్‌ తీయాల్సి వస్తుంది. మాస్క్‌ఫోన్‌తో ఆ అవసరం లేదు. ఇయర్‌ఫోన్స్‌ని చెవుల్లో పెట్టుకొని వై-ఫైతో అనుసంధానం చేసుకోవచ్చు.

ఫీచర్లు..
ఇది మళ్లీమళ్లీ ఉతికి ధరించగలిగే ఎన్‌ 95 మాస్క్‌. మైక్రోఫోన్‌, ఇయర్‌ఫోన్స్‌ ఇన్‌బిల్ట్‌గా వస్తాయి. తేలికైన ఇయర్‌బడ్స్‌తో అలసట లేకుండా గంటలకొద్దీ మ్యూజిక్‌ వినొచ్చు. ఫోన్‌ మాట్లాడుకోవచ్చు. ఆడియో స్పష్టంగా ఉంటుంది. మాస్కు చివరి భాగంలో నొక్కడం ద్వారా వాల్యూమ్‌ పెంచుకోవచ్చు. తగ్గించుకోవచ్చు.

ధర: రూ.2,500


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని