పంచుకుందాం

జ్ఞాపకాలు... కొందర్ని బాధిస్తే.. మరికొందరిని బతికిస్తాయి!

Updated : 25 Sep 2021 06:30 IST

జ్ఞాపకాలు...
కొందర్ని బాధిస్తే..
మరికొందరిని బతికిస్తాయి!


నేను...
నీ పక్కన చోటు అడిగాను
నువ్వు శూన్యాన్ని మిగిల్చావు!


నా జీవితం గురించి చెప్పాలంటే...
నీ పరిచయానికి ముందు...
ఆ తర్వాత అనే చెప్పాలేమో!


తను వెళ్లిపోయింది..
జ్ఞాపకాలను మాత్రం నాకు వదిలేసి!


నేనంటే నీకిష్టంలేదన్నది నిజం
ఈ నిజాన్ని నా హృదయం
అంగీకరించలేదన్నదీ నిజమే...

- ఎం. రత్నకిషోర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని