పొట్టి సొగసుల మేళా..

పొట్టి నిక్కరుపై పొడవాటి చొక్కా.. తాజా ఫ్యాషన్‌. ‘మేం ఆధునికం’ అనుకునే గాళ్స్‌ ఈ ట్రెండ్‌కి ఫ్రెండ్‌లా మారితే.. సెలెబ్రెటీలూ ఈ స్టైల్‌ని చేరదీసి మామూలు అమ్మాయిలు ‘ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో యూ...’ అనేలా...

Updated : 25 Sep 2021 06:24 IST

పొట్టి నిక్కరుపై పొడవాటి చొక్కా.. తాజా ఫ్యాషన్‌. ‘మేం ఆధునికం’ అనుకునే గాళ్స్‌ ఈ ట్రెండ్‌కి ఫ్రెండ్‌లా మారితే.. సెలెబ్రెటీలూ ఈ స్టైల్‌ని చేరదీసి మామూలు అమ్మాయిలు ‘ఐ వాన్నా ఫాలో ఫాలో ఫాలో యూ...’ అనేలా చేసేస్తున్నారు. మొన్న పాప్‌ సింగర్‌ మిలీ సైరస్‌ న్యూయార్క్‌ నుంచి లండన్‌ వెళ్తున్నప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో ఈ స్టైల్‌తో ఫొటోగ్రాఫర్లకి చిక్కితే.. నిన్న బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారూఖ్‌ కూతురు సుహానా ఇదే తరహా దుస్తులు ధరించి ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో నింపేసింది. అంతకుముందో, వెనకో.. సారా అలీఖాన్‌, తారా సుతారియాలు సైతం ఈ ధోరణిని అందిపుచ్చుకోవడంతో ఈ మోడ్రన్‌ ఫ్యాషన్‌ కాస్తా నగరాలు, పట్టణాల్లోని వీధులకు చేరింది.

పెద్ద సైజు చొక్కాలకు జతగా లెగ్గింగ్స్‌, షార్ట్స్‌, జీన్స్‌ వేయడం ఈ ట్రెండ్‌ ఆనవాయితీ. అన్నింట్లోకి పాపులర్‌ అయింది మాత్రం ఓవర్‌సైజ్డ్‌ చొక్కాలకు డెనిమ్‌ షార్ట్స్‌ వేయడం. దాంతోపాటు స్పోర్ట్స్‌ షూలు లేదా స్ట్రాప్డ్‌ సాండిల్స్‌ వేస్తే సొగసుకు మరిన్ని వన్నెలు అద్దినట్టే. రంగుల విషయానికొస్తే తెలుపు రంగు టాప్స్‌కి, బ్లూ కలర్‌ షార్ట్స్‌ టాప్‌ అంటున్నారు ఫ్యాషనిస్ట్‌లు. గళ్ల చొక్కాలూ తర్వాత వరుసలో ఉన్నాయి. ఆధునికంగా ఉండటం, ధరించడానికి సౌకర్యంగా ఉండటంతో అమ్మాయిలు వీటి వెంట పడుతున్నట్టు ఫ్యాషన్‌ పండితుల ఉవాచ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు