ఏకాగ్రత.. కుదురుతుందిలా!
ఎంత ప్రయత్నించినా మూడ్ రావడం లేదు బాస్...
కష్టపడి పని చేద్దామంటే ఏకాగ్రత కుదరడం లేదు...
ఇలాంటి సాకులు చెప్పే ఉద్యోగులెందరో. అసలు పనిలో ఏకాగ్రత కుదరాలంటే ఏం చేయాలి? ఇవిగోండి టిప్స్.
పోమోడోరో టెక్నిక్: బద్ధకం బాగా ఉన్నవాళ్లకి ఈ టైం మేనేజ్‌మెంట్ కిటుకు చక్కగా పని చేస్తుంది. పని గంటలను 25 నిమిషాల చొప్పున భాగాలుగా విభజించుకోవాలి. ఈ ఒక్క సెషన్‌నే పోమోడోరోగా పిలుస్తారు. ఒక పోమోడోరో ముగిసిన వెంటనే 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. నాలుగు అయితే సమయం కొంచెం పెంచాలి. ఇలా చేస్తే మెదడు చురుగ్గా తయారవుతుందనీ, ఏకాగ్రత పెరుగుతుంది అంటారు నిపుణులు.
వ్యాయామం: బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ 2019 అధ్యయనం ప్రకారం వ్యాయామంతో రోజు ప్రారంభిస్తే మెదడులో బీడీఎన్‌ఎఫ్ స్థాయిలు, కార్టిసాల్ హార్మోన్లు పెరిగి చురుగ్గా తయారవుతారట. కఠోర వ్యాయామాలు కాకపోయినా పరుగులాంటి నడక, యోగా, ప్రాణాయామం 20 నిమిషాలైనా చేయాలి.
ధ్యానం: రోజుకి పదినిమిషాల చొప్పున కనీసం ఎనిమిది వారాలపాటు చేస్తే ఒత్తిడి తగ్గి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఒకేపనిని పదే పదే చేస్తుంటే మెదడులో అంతర్లీనంగా అది రికార్డు అవుతుంది. తర్వాత వందశాతం ప్రయత్నం చేయకుండానే పనిపై పట్టు సాధించవచ్చు. దీంతోపాటు దీర్ఘ శ్వాస, నిశ్శబ్దంగా ఉండటం.. లాంటివి చేస్తుండాలి.
ఒకేపని: ఒకేసమయంలో నాలుగైదురకాల పనులు చేస్తే ఉత్పాదకత పెరుగుతుందని భావిస్తుంటారు చాలామంది. కానీ మన మెదడు ఈ మల్టీ టాస్కింగ్‌కి అనుగుణంగా తయారు కాలేదు. ఇలా చేస్తే దేనిమీద కూడా పూర్తి ఏకాగ్రత పెట్టలేం. అందుకే ఒకే సమయంలో ఒకే టాస్క్ పెట్టుకోవాలి.
మెదడుకు శిక్షణ: చిన్న వయసులో మెదడులో కొత్త కణాలు అత్యధికంగా పుడుతుంటాయి. వయసు పెరిగినకొద్దీ తగ్గుతాయి. అందుకే చిన్నప్పుడు చాలా విషయాలు వేగంగా నేర్చుకుంటాం. కానీ మెదడుకి ఎక్కువ ఆక్సిజన్ అందించడం ద్వారా మెదడులోని సెరిబ్రల్ కార్టెక్స్, హిప్పోక్యాంపస్ ఉత్తేజితమై చురుగ్గా పని చేస్తుందట. పజిల్స్ విప్పడం, చెస్ ఆడటం, సృజనాత్మకంగా ఆలోచించడం.. ఇవన్నీ మెదడుకి ఆక్సిజన్ ఇచ్చే వ్యాయామాలు.
వాతావరణం: మన చుట్టూ ఉన్న వాతావరణం సైతం పనిలో ఏకాగ్రత కుదరడానికి కారణమవుతుంది. గదిలో మంచి వెలుతురు వచ్చేలా, సౌకర్యవంతంగా కూర్చునేలా, సరైన ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. చుట్టుపక్కల చిరాకు కలిగించే, అదేపనిగా కబుర్లు చెప్పే వ్యక్తులు లేకుండా చూసుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
waltair veerayya: ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TS Govt: ఆ తీర్పు అమలును రెండు వారాలు నిలిపివేయండి: హైకోర్టును కోరిన తెలంగాణ ప్రభుత్వం
-
Movies News
Tamil movies: ఈ ఏడాది ఆసక్తి రేకెత్తిస్తోన్న కోలీవుడ్ చిత్రాలివీ!
-
Sports News
Ashwin: పాక్ క్రికెట్ బోర్డు వ్యాఖ్యలకు అశ్విన్ ఘాటు స్పందన!
-
India News
SC: న్యాయమూర్తిగా ఎల్సీవీ గౌరీ నియామకం సరైందే.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు