Published : 02 Oct 2021 01:10 IST

బైకర్లకీ ఎయిర్‌బ్యాగ్‌లు

కుర్రకారుకి బైక్‌ దొరికితే.. మేఘాల్లో తేలిపోతుంటారు. వేగం ఇచ్చే జోష్‌ని అందిపుచ్చుకోవాలనే ఆరాటమే తప్ప జరగబోయే ప్రమాదం గురించి ఆలోచించరు. ఫలితం.. బండి ఏమాత్రం అదుపు తప్పినా ప్రమాదాల పాలవుతుంటారు. ఒక్కోసారి ప్రాణాపాయమూ తప్పదు. ఇలాంటి జోరు బాబులకు రక్షణనిచ్చే బ్యాక్‌ప్యాక్‌ని రూపొందించింది ‘ఎవోక్‌ స్పోర్ట్స్‌’ కంపెనీ. ప్రపంచంలోనే ఈ తరహాలో ఇది మొదటిది. కాలేజీ కుర్రాడిలా ఈ బ్యాగుని ఎంచక్కా వీపునకు తగిలించుకోవడమే. కారు ఎయిర్‌బ్యాగ్‌లా ఈ ‘కమ్యూట్‌ ఎయిర్‌ ప్రో 18’ బ్యాక్‌ప్యాక్‌లోనూ ఎయిర్‌ బ్యాగ్‌లుంటాయి. బైకర్‌ కిందపడగానే రెప్పపాటులో, 0.2సెకన్లలో పూర్తిగా తెరుచుకుంటాయి. తల, మెడ, భుజాలు, ఛాతీ చుట్టూ రక్షణ వలయంలా ఏర్పడతాయి. గాయాలు కాకుండా కాపాడతాయి. ఈ బ్యాగులో అమర్చిన సెన్సర్ల పరికరం బ్యాక్‌ప్యాక్‌ నేలను తాకేలోపే సంకేతాలు పంపి ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకునేలా చేస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని