రండి.. కలిసి ఏడుద్దాం

చిన్న కష్టాలకే చిగురుటాకులా వణికిపోవడం.. బాధలు భరించలేక బలవంతంగా ఉసురు తీసుకోవడం ఈకాలం యువతలో ఎక్కువ. దేశం, ప్రాంతం, స్థాయి.. ఎక్కడైనా, ఎవరైనా ఇదే పరిస్థితి. ఈ మానసిక బాధలు...

Updated : 24 Oct 2021 01:44 IST

చిన్న కష్టాలకే చిగురుటాకులా వణికిపోవడం.. బాధలు భరించలేక బలవంతంగా ఉసురు తీసుకోవడం ఈకాలం యువతలో ఎక్కువ. దేశం, ప్రాంతం, స్థాయి.. ఎక్కడైనా, ఎవరైనా ఇదే పరిస్థితి. ఈ మానసిక బాధలు తీరాలంటే ఎలా? మనసారా ఏడవడమే ఉపశమనం అంటోంది స్పెయిన్‌లోని ఓ సంస్థ. అందుకే మాడ్రిడ్‌ నగరంలో ‘లా లొలేరియా’ పేరుతో ఒక క్రయింగ్‌ రూం ఏర్పాటు చేశారు. అక్కడ ఒక విశాలమైన భవనంలో అరల్లాంటి గదులు ఏర్పాటు చేశారు. మానసిక బాధలు ఉన్నవారు అందులోకి వెళ్లిపోవాలి. అక్కడ గోడలకు పెద్దపెద్ద అద్దాలు వేలాడదీస్తారు. పక్షి పంజరాల్లాంటివి ఏర్పాటు చేశారు. బాత్‌ టబ్‌లుంటాయి. గదంతా రంగురంగుల లైట్లతో అలంకరిస్తారు. ఇష్టమైన ప్రదేశంలో ఉండి బాధంతా తీరిపోయేలా ఏడవచ్చు. అయినా బాధ తగ్గలేదు అనిపిస్తే అక్కడే గోడలకు అతికించిన హెల్ప్‌లైన్‌ నెంబర్లకు ఫోన్‌ చేసి సాయం పొందొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు