వర్క్‌ ఫ్రం హోం నచ్చట్లే!

ప్రయాణం చేసే బాధ తప్పుతుంది. బోలెడంత సమయం మిగులుతుంది. వర్క్‌ ఫ్రం హోం అంటే ఎన్ని లాభాలో! కానీ అదేం చిత్రమో.. ఇంటి నుంచి పని కన్నా ఆఫీసే ఎంతో హాయి అంటున్నారు 75 శాతం కుర్ర ఉద్యోగులు.

Updated : 31 Oct 2021 00:40 IST

ప్రయాణం చేసే బాధ తప్పుతుంది. బోలెడంత సమయం మిగులుతుంది. వర్క్‌ ఫ్రం హోం అంటే ఎన్ని లాభాలో! కానీ అదేం చిత్రమో.. ఇంటి నుంచి పని కన్నా ఆఫీసే ఎంతో హాయి అంటున్నారు 75 శాతం కుర్రఉద్యోగులు. తాజా అధ్యయనంలో తేలిన వాస్తవం ఇది. ఎందుకిలా అంటే...

ఆఫీసే అనుకూలం

ఎన్ని లాభాలున్నా ఇల్లు ఇల్లే.. ఆఫీసు ఆఫీసే అన్నది యువోద్యోగుల మాట. ఇంట్లో ఎంత సమయం కేటాయించినా పని ముందుకెళ్లదు అన్నది ఎక్కువమంది అభిప్రాయం. మనుషుల అలికిడి, పిల్లల అల్లరి, శబ్దాలు.. ఇవన్నీ పని వాతావరణాన్ని చెడగొడుతూనే ఉంటాయట.

సహోద్యోగులు, స్నేహితులు

ఆఫీసులో పనితోపాటు సరదాలు, స్నేహితులు, సహోద్యోగులు అన్నీ ఉంటాయి. క్యాంటీన్‌ గాసిప్‌లు, మనసు విప్పి మాట్లాడుకోవడాలు.. మిస్‌ అవుతున్నామనే బాధ చాలామందిలో ఉందట. సహోద్యోగులు చుట్టూ ఉంటే అదో రకమైన చెప్పలేని అనుభూతి. వర్క్‌ ఫ్రం హోంలో ఒంటరినైపోయాననే బాధ ఉంటోందట.

బాధ్యతల్లో బందీ

ఇంట్లో ఉంటే పనిలో సీరియస్‌నెస్‌ అస్సలు రాదంటున్నారు మనోళ్లు. ఏదో పని చేయమని భార్య పురమాయిస్తుంది. పిల్లలుంటే వాళ్లతో ఆటపాటలుంటాయి. అనుకోకుండా వచ్చిపడే బంధువులకు మర్యాదలు చేస్తుండాలి. పనికి ఇవన్నీ ప్రతిబంధకాలే అంటున్నారు.

మనకి నప్పదు

సాఫ్ట్‌వేర్‌కి తప్ప వేరే ఉద్యోగాలకు ఇంటి నుంచి పని సూటవ్వదు అన్నది చాలామంది యువ ఉద్యోగుల అభిప్రాయం. చాలా ఏళ్లుగా ఐటీ ఉద్యోగులకు ఈ రంగంలో అనుభవం ఉంది. కానీ కార్పొరేట్‌ ఉద్యోగులు, స్టార్టప్‌లు, కస్టమర్లతో నేరుగా సంబంధాలు నెరిపే ఉద్యోగులకు ఈ ట్రెండ్‌ కష్టమే అన్నది ఎక్కువమంది భావన.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని