ప్రతీకార సింగారం
నిన్నటిదాకా కరోనా కాలం. ఫ్యాషన్లకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండే అమ్మాయైనా.. ఒంటిపై డిజైనర్‌వేర్ లేనిదే కాలు బయట పెట్టని కుర్రాడైనా సాదాసీదా దుస్తులు ధరించి ఇంటికే పరిమితమయ్యారు. మెల్లమెల్లగా పరిస్థితులు సద్దుమణుగుతుండటంతో వాళ్లు ‘రివెంజ్’ బాట పడుతున్నారు. ఇన్నిరోజుల తమ ప్రతీకారాన్ని వడ్డీతో సహా తీర్చుకునేలా సొగసుల్ని పరుగులు పెట్టిస్తున్నారు. లోకల్ నుంచి గ్లోబల్ దాకా ఈ ‘రివెంజ్ ఫ్యాషన్’ ట్రెండ్ జోరు మీదుంది.
రివేంజ్ డ్రెస్సింగ్‌కి తోడు ఓ సందర్భం కూడా కలిసి వచ్చిందనుకోండి.. ఇక వాళ్లను ఆపేవాళ్లుండరు. లాక్మే ఫ్యాషన్ వీక్, దసరా, దీపావళి.. అలాంటి సందర్భాలే. ఆర్నెల్లుగా పెరిగిపోతున్న ఆర్డర్లు చూస్తుంటే ఈ ట్రెండ్ మాంచి ఊపు మీదుంది అని చెప్పక తప్పదంటారు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ షణ్మిత. ‘మా దగ్గరికొస్తున్న వాళ్లలో ఫ్యాషన్, మోడలింగ్, సినిమా రంగాలకు చెందినవాళ్లతో పాటు యూత్ ఎక్కువ. ప్రత్యేక సందర్భాలతోపాటు రోజువారీ ధరించడానికి కూడా లేటెస్ట్ స్టైల్స్ కావాలని అడుగుతున్నారు. కొత్త డిజైన్లకు ఆర్డర్లు ఇస్తున్నారు’ అంటూ ఇప్పుడున్న ధోరణి వివరిస్తున్నారు. ఆమె మాటల్లో చెప్పాలంటే పండగ రోజుల్లో కుర్రాళ్లు కుర్తా, పైజామాలతో సందడి చేస్తే.. అమ్మాయిలు గాగ్రా, ఛనియా ఛోళీలు, అనార్కలీ డ్రెస్‌లు, సెక్విన్స్ చీరలను ఆదరించారు. జ్యువెల్లరీని అదనంగా సింగారించుకుంటున్నారు. పార్టీలు, మామూలు రోజుల్లో వాడటానికైతే డిజైనర్ ఔట్‌ఫిట్‌లు, క్రాప్‌టాప్‌లు, ఈవినింగ్ గౌన్‌లు, స్కర్ట్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారట. ఇదేసమయంలో ‘రివేంజ్ హీల్స్’ అనే ట్రెండ్ సామాజిక మాధ్యమాలను ఊపేసింది. హాలీవుడ్ తారలు, పాప్‌సింగర్లు ఈ ట్రెండ్‌ని పరుగులు పెట్టించారు.
ఏంటీ ట్రెండ్?
రివెంజ్ డ్రెస్సింగ్, రివెంజ్ ఫ్యాషన్.. ఈ ముచ్చట ఇప్పటిది కాదు. ఈ ట్రెండ్‌కి ఆద్యురాలు ప్రిన్సెస్ డయానా. 1994లో ఆమెకి భర్త ప్రిన్స్ ఛార్లెస్‌తో గొడవలొచ్చాయి. విడాకులు కన్ఫమ్ అయ్యాక ఒక్కసారిగా తన స్టైల్‌ని మార్చేసింది. ఒక టీవీ షోకి ప్రత్యేకంగా ముస్తాబై వెళ్లింది. భుజాలు కిందికి దిగిన నలుపు రంగు గౌన్, మెడచుట్టూ ముత్యాల హారం ధరించింది. ఈ బోల్డ్ డ్రెస్ అప్పట్లో పెద్ద సంచలనం. ఇదే రివెంజ్ డ్రెస్సింగ్ ట్రెండ్ అయి కూర్చుంది. తర్వాత హాలీవుడ్ స్టార్లు బెల్లా హడిడ్, ఎలిజబెత్ హర్లే తమ బోయ్‌ఫ్రెండ్స్‌కి బ్రేకప్ చెప్పినప్పుడు ఇలాంటి హాట్‌హాట్ ప్రతీకార ఫ్యాషన్లకు తెర తీశారు. భర్తతో విడిపోయాక మలైకా అరోరా ఇదే ట్రెండ్ కొనసాగిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BJP vs Congress: ‘రాహుల్జీ మీకు ధన్యవాదాలు’.. జర్మనీపై దిగ్విజయ్ ట్వీట్‌కు భాజపా కౌంటర్!
-
Sports News
Best Fielder: ప్రస్తుతం ప్రపంచంలో బెస్ట్ ఫీల్డర్ అతడే: జాంటీ రోడ్స్
-
India News
Divya Spandana: అప్పుడు రాహులే నాకు మానసిక ధైర్యం ఇచ్చారు: నటి వ్యాఖ్యలు
-
Movies News
Pathu Thala: వారికి థియేటర్లోకి నో ఎంట్రీ.. వీడియో వైరల్..
-
Politics News
Bandi sanjay: కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలెందుకు భరించాలి? సహించాలి?: బండి సంజయ్
-
General News
Andhra News: పోలీసులకు ఎదురుదెబ్బ.. అంజన్‌ను విడుదల చేయాలని కోర్టు ఆదేశం