కొంటె కొటేషన్‌

చేపతో పాప చుంబనం... పాపతో బాబు ఆలింగనం!

Updated : 13 Nov 2021 05:37 IST

* చేపతో పాప చుంబనం... పాపతో బాబు ఆలింగనం!

- ఎన్‌.సత్యారావు, విశాఖపట్నం

* ప్రియుడితో సరసం... చేపతో సాహసం

- సురేశ్‌ జాలాది, ఈమెయిల్‌

* సోగ్గాడితోనే ముద్దు... సొరచేపతో అసలొద్దు!

- పేరాల శ్రీయాన్ష్‌, హుజూరాబాద్‌

* ప్రాణి ప్రేమలో రాణి... రాణి మోజులో రాజు!

- ఎం.బాలాజీ, తిరుపతి

* ఫిష్‌తో ఫ్రెష్‌ కిస్‌... లవర్‌తో ఫస్ట్‌ కిస్‌!

- చంద్రశేఖర్‌, ఎమ్మిగనూరు

* బాగుంది ముద్దుల పోటీ... వెళ్లొద్దు హద్దులు దాటి!

- నగిరి మహాశ్రీ, ఈమెయిల్‌

* మొగుడితో చుంబనం సూపరూ... షార్క్‌తో సరసం డేంజరూ!

- టి.రామకృష్ణ, విశాఖపట్నం

* చేపను ముద్దాడుతున్న పాప... కాదది తెరచాప!

- సుబ్బారావు, తెనాలి

* నీటిలోనా, నేలమీదా ముద్దుకు లేదా హద్దు!

- ఎం.పద్మావతి, తణుకు

* సముద్రమే హద్దు... సొరచేప మాయలో పడొద్దు!

- పేరాల నాగరాజు, హుజూరాబాద్‌

* నవజంట ముద్దులు... దాటొద్దోయ్‌ హద్దులు!

- చలపతిరావు కుసెట్టి, ఈమెయిల్‌

* సాగరకన్య ముద్దుతో... సహసవీరుడికి లేదిక హద్దు!

- శివధారి సాయి, ఈమెయిల్‌

* మొగడికో ముద్దు... షార్క్‌కి వద్దు!

- రాజ్‌కుమార్‌ గనవేని, ఈమెయిల్‌

* షార్క్‌తో లిప్‌లాక్‌... చూసేవాళ్ల మైండ్‌ బ్లాక్‌!

- యాడాల చోటె, ఈమెయిల్‌

* షార్క్‌తో ముద్దు... ప్రాణాలతో చెలగాటం వద్దు!

- వినోద్‌కుమార్‌ రెడ్డి, ప్రొద్దుటూరు

* సరస్సులో ముద్దు... ఉండాలి ఓ హద్దు!

- శివప్రసాద్‌, ఈమెయిల్‌

* మీనంతో ముద్దు... ప్రణయానికి లేదు హద్దు!

- రామచంద్రం కొణతాల, ఈమెయిల్‌

* నీ తనువు తాకి పులకించిన వేళ... నా తనువు మారి తపిస్తున్న వేళ!

- లక్ష్మి, హైదరాబాద్‌

* ముద్దులాటకై మరో రూపం... అది కాదే నా ప్రతిరూపం!

- శ్రీలు, నరసరావుపేట


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని