సొగసుల విన్‌టర్!
చలి ముదురుతోంది. మరోవైపు సొగసు స్పృహ ఏమాత్రం తగ్గట్లేదు. అప్పుడేం చేయాలి? రెండింటికీ న్యాయం చేసేలా డ్రెస్‌సెన్స్ ఉండాలి. స్టైల్‌కి స్టైల్, చలికి చెక్. ఇది జరగాలంటే మన వార్డ్‌రోబ్‌లో ఈ జాబితా ఉండి తీరాల్సిందే.
* స్కిన్నీ జీన్స్: చలిని కాచుకుంటూనే స్టైలిష్‌గా కనిపించే స్కిన్నీ జీన్స్ ఈ సీజన్‌కి చక్కగా సరిపోతాయి. ఫ్లాట్ హీల్స్, లెదర్ జాకెట్, సిల్క్ డ్రేప్ టాప్.. జీన్స్‌కి జతగా ఏం వేసుకున్నా అమ్మాయిలు అందంగానే కనిపిస్తారు.
* స్వెటర్: వింటర్‌లో అలక్ష్యం చేయలేని ఔట్‌ఫిట్ స్వెటర్. ఇందులోనూ పర్సనాలిటీ, వాడకానికి అనుగుణంగా కార్డిగన్, నెక్, స్లీవ్, ఫ్యానీ, టర్టిల్ నెక్.. అంటూ రకాలున్నాయి. వీటికి జతగా మిడీ స్కర్ట్, జీన్స్, ట్రోజర్, లెదర్ ప్యాంట్.. వేస్తే మోడర్న్ లుక్ ఖాయం.
* ఫెడోరా: స్టైల్‌కి స్టైల్, తలకి వెచ్చదనం కావాలి అనుకుంటే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఈ వింటర్‌లో తమ వార్డ్‌రోబ్‌లో కచ్చితంగా చేర్చుకోవాల్సింది ఫెడోరా టోపీ. ఇందులోనూ ఊలు, ఫెల్ట్ ఫెడోరాలు చలిని తరిమికొడతాయి.
* పఫర్ జాకెట్: ఇవి కుర్రాళ్ల స్పెషల్. చలి తీవ్రంగా ఉన్నప్పుడు ఒంటికి వెచ్చదనం ఇస్తూనే అబ్బాయిలకు మ్యాన్లీ లుక్ తెస్తుందీ జాకెట్.
* ఓవర్ ద నీ బూట్లు: ఆధునికంగా, డైనమిక్‌గా కనిపించాలి అనుకునే అమ్మాయిలు తప్పక ఆదరించాల్సింది మోకాళ్ల దాకా ఉండే బూట్లు. జీన్స్, స్కర్ట్, జంపర్స్‌తో కలిపి వేస్తే చక్కనమ్మలు మరింత గ్లామరస్‌గా కనిపిస్తారు.
* టర్టిల్ నెక్ టాప్: ఒంటికి వెచ్చదనం, స్టైల్ మేళవింపు తప్పనిసరి అనుకుంటే యూత్ వీటిని ప్రయత్నించొచ్చు. వీటిపై స్వెటర్, స్లీవ్‌లెస్ డ్రెస్ ఏదైనా వేసుకోవచ్చు. బాటమ్‌లో జీన్స్ బాగుంటాయి.
* లెదర్ జాకెట్: ఈ చలికాలాన్ని స్టైలిష్‌గా మార్చేయాలి అని కంకణం కట్టుకున్న కుర్రకారు తమ ఒంటిపై చోటివ్వాల్సింది లెదర్ జాకెట్‌కి. ఎలాంటి డ్రెస్‌పై అయినా వీటిని ధరించవచ్చు.
* గ్లౌజులు: చేతుల్ని జేబుల్లో పెట్టుకుంటే చలి తగ్గొచ్చుగాక.. స్టైల్‌గా కనిపించాలంటే చేతులకు గ్లౌజుల తొడుగులు వేయాల్సిందే. వేరే చెప్పేదేముంది? వీటితో రెండిందాలా ఉపయోగమని!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
-
Movies News
IPL 2023: ఐపీఎల్ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే!
-
World News
Heartbreaking Story: మా అమ్మ కన్నీటితో డైరీలో అక్షరాలు తడిసిపోయాయి..!
-
World News
ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ మాయం..ఎయిర్టాగ్తో నిందితుడిని గుర్తించిన ప్రయాణికుడు