Updated : 20 Nov 2021 06:40 IST

ట్వీటు పేలాలంటే.. పోస్ట్‌ పండాలంటే!

పక్కింటి కుర్రాడు.. ఎదిరింటి అమ్మాయి.. చూసీ చూస్తుండగానే ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మారిపోతున్నారు. సెలెబ్రెటీ హోదా అందుకుంటున్నారు. అంతా సోషల్‌ మీడియా మహిమ. మీకూ సత్తా ఉంటే సరైన వ్యూహం అనుసరిస్తే.. పోస్ట్‌లు, ఫొటోలు, ట్వీట్లకు ప్రత్యేక సమయం కేటాయిస్తే.. జనాల నాడి పట్టుకోవచ్చు. ఎలాగంటారా...?


ఫేస్‌బుక్‌

అనువైన రోజులు: గురు, శుక్రవారాలు

సరైన సమయం: మధ్యాహ్నం 1 నుంచి 3

ఎందుకు?: ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు.. పని, చదువు ఒత్తిడి నుంచి ఈ సమయానికి కొంచెం తేరుకుంటారు. తీరుబడిగా ఉంటారు. ఈ రోజుల్లోనే ఎక్కువగా ఆన్‌లైన్‌కి వస్తారు.


పింటరెస్ట్‌

అనువైన రోజులు: శని, ఆదివారాలు

సరైన సమయం: రాత్రి 8 నుంచి 11

ఎందుకలా?: పింటరెస్ట్‌ ఖాతాదారుల్లో అత్యధికులు గృహిణులు, సమగ్ర సమాచారం క్లుప్తంగా ఉండాలని కోరుకునేవాళ్లు. బండెడు ఇంటిపని ఉండే వీళ్లకు సమయం చిక్కేది ఎక్కువగా శనివారమే.


ట్విటర్‌

అనువైన రోజులు: సోమవారం నుంచి శుక్రవారం

సరైన సమయం: మధ్యాహ్నం 12 నుంచి 6 వరకు

ఎందుకని?: సూటిగా, సుత్తి లేకుండా 120 పదాల్లో చెప్పే ఈ ట్విటర్‌ పిట్ట పలుకుల్ని చాలామంది ఆఫీసు సమయాలు, పనివేళల్లోనే చూస్తారు. ట్వీట్‌ చదవడానికి, స్పందించడానికి పెద్దగా సమయం అవసరం లేదు.


లింక్డ్‌ఇన్‌

అనువైన రోజులు: మంగళవారం నుంచి గురువారం

అనువైన సమయం: ఉదయం 7 నుంచి 9, సాయంత్రం 5 నుంచి 7

ఎందుకంటే?: ఆఫీసు, ఉద్యోగాలకు సంబంధించిన నెట్‌వర్కింగ్‌ మాధ్యమం ఇది. సాధారణంగా పనివేళలకు ముందు, పూర్తైన తర్వాతే జనం వీటిని ఎక్కువగా చూస్తుంటారు.


ఇన్‌స్టాగ్రామ్‌

అనువైన రోజులు: శనివారం నుంచి సోమవారం

సరైన సమయం: ఉదయం 7 నుంచి 11, సాయంత్రం 5 నుంచి 7

ఎందుకు?: వారాంతాల్లో కుర్రకారు హుషారు మీదుంటారు. పార్టీలు, యాక్టివిటీ ఫొటోలు, సమాచారం తెగ పోస్ట్‌ చేస్తుంటారు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటారు. అదేసమయంలో మనం ఎంటరైతే అందరికీ అందుబాటులో ఉండొచ్చు.


యూట్యూబ్‌

అనువైన రోజులు: అన్ని రోజులు

సమయం: సోమవారం నుంచి శుక్రవారం: మధ్యాహ్నం 2 నుంచి 5, వారాంతాలు: ఉదయం 9 నుంచి 11వరకు

ఎందుకంటే?: పాపులారిటీతోపాటు కుర్రకారుకి ఇబ్బడిముబ్బడిగా డబ్బు సంపాదించే అవకాశం కల్పిస్తోన్న మాధ్యమం యూట్యూబ్‌. ఆఫీసులు, చదువులు అయిపోగానే తమకిష్టమైన ఛానెళ్లు తెరుస్తారు ఎవరైనా. వాళ్లకి ఆ సమయం కలిసొస్తుంది. వారాంతాల్లో ఇంటి దగ్గరే ఉండే వ్యూవర్స్‌కి పొద్దునే వీడియోలు సిద్ధంగా ఉండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని