మాధవన్‌ కొడుకు.. ఈతలో చురుకు

డాక్టర్‌ కొడుకు డాక్టర్‌.. యాక్టర్‌ కొడుకు యాక్టర్‌ అవడం కామన్‌. కానీ హీరో మాధవన్‌ అబ్బాయి వేదాంత్‌ స్విమ్మర్‌ అయ్యాడు. ఇది వెరైటీ. ఈతకొలనులో పతకాలు కొల్లగొడుతూ ...

Updated : 20 Nov 2021 06:35 IST

డాక్టర్‌ కొడుకు డాక్టర్‌.. యాక్టర్‌ కొడుకు యాక్టర్‌ అవడం కామన్‌. కానీ హీరో మాధవన్‌ అబ్బాయి వేదాంత్‌ స్విమ్మర్‌ అయ్యాడు. ఇది వెరైటీ. ఈతకొలనులో పతకాలు కొల్లగొడుతూ తండ్రి గర్వపడేలా చేస్తున్నాడు. ఇది చెప్పుకోదగ్గ సంగతి. అందుకే ఆ కుర్రాడి సంగతులు క్లుప్తంగా...

* బెంగళూరులో ఈమధ్యే జరిగిన నలభై ఏడో జూనియర్‌ నేషనల్‌ ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు రజతం, మూడు కాంస్య పతకాలు నెగ్గాడు.

* అంతకు ముందు మార్చిలో లాత్వియన్‌ ఓపెన్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌ పోటీలో మూడోస్థానంలో నిలిచాడు.

* రాంచీలో పుట్టి, ముంబయిలో స్థిరపడ్డ వేదాంత్‌ మహారాష్ట్ర తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

* ముంబయిలో టెన్త్‌ అయ్యాక, ప్రస్తుతం దుబాయ్‌లోని యూనివర్సల్‌ అమెరికన్‌ స్కూల్‌లో ఇంటర్‌ చదువుతున్నాడు.

* స్కూల్‌లో చదువుతున్నప్పుడే ఈతపై ఆసక్తి మొదలైంది. ‘గోరేగావ్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌’, ‘గ్లెన్‌మార్క్‌ ఆక్వాటిక్‌ ఫౌండేషన్‌’లలో చేరి మెలకువలు నేర్చుకున్నాడు.

* తను ఫ్రీస్టైల్‌ విభాగంలో దిట్ట. 2017లో తొలి పోటీలో పాల్గొన్నాడు.

* వేదాంత్‌ అమ్మకూచి. ఏమాత్రం తీరిక దొరికినా తల్లి సరితా బిర్జేతోనే అంటిపెట్టుకొని ఉంటాడు. ఆమె ‘సరితా’ పేరుతో ఆస్ట్రియాలోని క్లాగెన్‌ఫర్ట్‌లో ఫ్యాషన్‌ స్టోర్‌ నిర్వహిస్తోంది.

* పెంపుడు జంతువులంటే మమకారం. వీధి శునకాలను చేరదీస్తాడు. 2014లో పెటా నుంచి ‘పెటాస్‌ కంపాషనేట్‌ కిడ్స్‌ అవార్డు’ అందుకున్నాడు.

* వేదాంత్‌ ప్రతిభ ప్రపంచానికి తెలిసిన సమయంలోనే షారూఖ్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ డ్రగ్‌ కేసులో అరెస్టయ్యాడు. దీంతో ఇద్దరినీ పోలుస్తూ ఒక హీరో కొడుకు చెడుదారిలో వెళ్తే మరో హీరో పుత్రరత్నం.. తండ్రి, దేశం గర్వపడేలా విజయాలు సాధించాడని అంతా పొగడ్తల్లో ముంచెత్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని