Updated : 27 Nov 2021 06:34 IST

కొంటె కొటేషన్‌

ఆ ద్వీపానికి హద్దు ఆ కొండ సంద్రానికి హద్దు ఈ పాండా!
- రెల్లు రాంబాబు, చిలకలపల్లి


కలియుగ కుంభకర్ణా... కడలికి బలి కావొద్దురా!
- మొగులపల్లి చంద్ర, కదిరి


కొండలా కొవ్వెక్కిన మనిషి... సేద తీరేను ఒడ్డున అలసి!
- అక్కలదేవి రాంబాబు, హైదరాబాద్‌


సముద్రంలో గుట్ట అందం... బీచ్‌లో నీ పొట్ట మందం!
- పసునూరి కుమార్‌, నెక్కొండ


నేలపై బండరాజు... నీటిపై కొండరాజు
-టి.ప్రణీత, విశాఖపట్నం


అక్కడ కొండ... ఇక్కడ బండ!
- పాండురంగ, ఈమెయిల్‌


పోయిందా మతి... అలాగే ఉంటే అవుతుంది కాలపరిమితి!
- ప్రభాకర్‌ కురిటి, పుర్లి


తినేందుకు ఇవ్వు రెస్టు... తాకేట్టుంది పొట్ట ఎవరెస్టు!
- తాలాడ రామకృష్ణ, ఈమెయిల్‌


పవళించుటకు వద్దు పరుపు... సముద్ర తీరమే నాకు పానుపు!
- రామారావు మువ్వల, ఉద్దవోలు


అయ్యగారి రూపు భలే... అచ్చంగా కొండవ వలే!
- ఎ.కొండలరావు, దూసి


బాగుందిలే నీ ఆసనం... నిజం కాకూడదు శవాసనం!
- అందలం సత్యనారాయణ, కడప


బానపొట్ట బాబాయ్‌... భలేగుంది నీ బింబమోయ్‌!
- తాలాడ సృజన, కృష్ణాపురం


పవళించాడు బండరాయిలా... కనపడుతున్నాడు కొండరాయిలాఔ
- లక్ష్మి, దూసి


కడలి తీరంలో రిలాక్స్‌... కెరటం కొట్టిందో కొలాప్స్‌
సాగరం ఒడ్డున విన్యాసం... సంసారం వదిలి సన్యాసం?
- తంగి సన్యాసిరావు, శ్రీకాకుళం


చూస్తే నీ పొట్ట... అదురుతోంది గుట్ట
- సత్య చుండూరి, పాతగాజువాక


అదిగో కొండ... ఇదిగో అనకొండ!
- బి.శ్రీనివాసరావు, తుని


దూరాన కొండ... పొట్టోడి కుండ!
- బి.ఆర్‌.వి.మనోహర్‌రావు, హైదరాబాద్‌


కొండంత బొజ్జ... బజ్జున్న కొండ!
- రవి శ్రీనివాస్‌, విశాఖపట్టణం


కొండలా ఉన్న పొట్ట... కరిగేది ఎట్టా?
- మొర్రి హాసిని, కవిటి


నిద్ర లేస్తే సరి... లేదంటే నీ పని హరీ!
- వావిళ్లపల్లి వెంకటేశ్‌, ఈమెయిల్‌


ముందు పొట్ట... వెనక గుట్ట!
- చందు, వైజాగ్‌


ఆవల కొండ... ఈవల కుండౌ
- కృష్ణ తాటికొండ, వేములవాడ


అది కొండ బాస్‌... వీడు బండ బాస్‌!
- అవినాశ్‌ దేసెట్టి, ఈమెయిల్‌


సముద్ర మట్టాన్ని మించింది నీ పొట్ట... అట్టా పడుకుంటే తగ్గుతుంది ఎట్టా?
- శ్రీనివాస్‌ కిలానా, ఈమెయిల్‌


పైన గుట్ట... కింద గుట్టలాంటి పొట్ట!
- వంశీధర్‌ రెడ్డి, సూర్యాపేట


కొండలా ఉన్నానని మురిసిపోకు... గుండెకెంత ముప్పో మర్చిపోకు!
- రాఘవరాజు పట్టాభిరామరాజు, ఎర్రముక్కపల్లి


కొండతో ఢీ... నేను  రెఢీ!
- సూర్యకుమారి తల్లం, హైదరాబాద్‌


గుట్టలు పెరిగితే ప్రమోదం... పొట్టలు పెరిగితే ప్రమాదం!
- ముదుగంటి విష్ణువర్ధన్‌రెడ్డి, మ్యాడంపల్లి


కొండల ఉదరం... నదిలా నిబ్బరం!
- డీజే రావు, కళింగపట్నం


కొండను పోలిన కుండ అదే నాకు అండాదండా!
- సచిన్‌ పృథ్వీ, ఈమెయిల్‌


ఈ ఫొటోకి సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని