పెళ్లి ముఖ్యం.. పిల్లలే కష్టం!

...అంటున్నారు మన యూత్‌. అదేంటి పెళ్లయ్యాక ఎలాగూ పిల్లలు తప్పదుగా అంటారా! కానీ వాళ్ల కారణాలు, కష్టాలు వాళ్లకున్నాయి బాస్‌! ‘టుడే’ మ్యాగజైన్‌ ‘యూత్‌ సర్వే 2021’ పేరుతో నిర్వహించిన అధ్యయనంలో

Updated : 27 Nov 2021 06:27 IST

...అంటున్నారు మన యూత్‌. అదేంటి పెళ్లయ్యాక ఎలాగూ పిల్లలు తప్పదుగా అంటారా! కానీ వాళ్ల కారణాలు, కష్టాలు వాళ్లకున్నాయి బాస్‌! ‘టుడే’ మ్యాగజైన్‌ ‘యూత్‌ సర్వే 2021’ పేరుతో నిర్వహించిన అధ్యయనంలో 18-34 ఏళ్ల పడుచుప్రాయులు ఏకరువు పెట్టిన ఇంకొన్ని సంగతులు.

‘పెళ్లి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం, చేసుకొని తీరాల్సిందే’ అని 52 శాతం కుర్రకారు అభిప్రాయ పడితే.. చేసుకున్నా, చేసుకోకపోయినా ఫర్వాలేదు అన్నవాళ్లు 27 శాతం. ‘అబ్బే.. మాకు పెళ్లి అక్కర్లేదు. సహజీవనమే చేస్తాం’ అని తెగేసి చెప్పినవాళ్లు 21 శాతం.

పిల్లల విషయానికొస్తే.. 54శాతం అమ్మాయిలు, అబ్బాయిలు సంతానం కోరుకుంటుంటే.. 18శాతం ఎటూ తేల్చుకోలేకపోయారు. 14 శాతం మంది ఎవరినైనా పెంచుకుంటాం అంటే.. ఇంకో 14 శాతం అసలు పిల్లల్నే కనం అన్నారు.

పెళ్లి, పిల్లలు రెండూ ముఖ్యమే అన్నవాళ్లు 38శాతం మాత్రమే.

పెరుగుతున్న జీవన వ్యయాలు, భరించలేని ఖర్చులు, పిల్లల్ని భారంగా భావించడం, చిన్నారులతో గడపడానికి సమయం లేదనుకోవడం.. ఇవన్నీ సంతానం వద్దనుకునే యూత్‌ చెప్పిన సాకులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని