సినీ వలపు లేఖ
మనసంతా నువ్వే అయిన నీకు...
సఖీ.. చిరుజల్లుల్లో తడుస్తూ సంతోషంతో కేరింతలు కొడుతుండగా మొదటిసారి నిన్ను చూశాను. ఆ వర్షం సాక్షిగా నువ్వు నాకు నచ్చేశావు. రోజురోజుకీ నీపై ప్రేమ పెరుగుతూనే ఉంది. కానీ నాలో ఉన్న ప్రేమను నీతో ఎలా చెప్పను? నువ్వుంటే నాకిష్టం, నా మనసంతా నువ్వే, నువ్వు లేక నేను లేను, ఔనన్నా కాదన్నా, నిన్నే ప్రేమిస్తా, నీ ప్రేమ కావాలి అని అరిచి చెప్పాలని ఉంది. కానీ నువ్వు కాదంటే నాకు హార్ట్‌ఎటాక్.. ఔనంటే పెళ్లిచూపులు. తర్వాత పెళ్లిపీటలు ఎక్కడమే. ఆపై మనం ఒక్కటైతే ఈ ప్రేమదేశం మొత్తం తిరిగేద్దాం. నువ్వు నో అంటే మాత్రం నేను దేవదాసు అయిపోతాను సుమీ!
ఒక్కమాట చెబుతున్నా విను. పిల్లా నువ్వు లేని జీవితం నాకొద్దు. నువ్వు పక్కన ఉంటేనే నాకు హ్యాపీడేస్. నిజం చెబుతున్నా.. నా మొదటి ప్రేమలేఖ ఇదే. నీకూ నాపై ఇష్టం ఉంటే శ్రీవారికి ప్రేమలేఖ అంటూ నచ్చినన్ని రాసుకోవచ్చు. నా మనసులో మాట నీ ముందు ఉంచా. నీ పిలుపు కోసం ఎదురుచూస్తూ నిన్ను కలుసుకోవాలని ఉంది. ఒప్పుకుంటావని.. ప్రేమతో...
నీ సినిమా ప్రేమికుడు
- పంపినవారు: డి.శైలజ, ఈమెయిల్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Andhra News: ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్థం.. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు
-
Crime News
వరంగల్‌లో భాజపా నేత ఆత్మహత్య.. నమ్మినవారు మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో
-
India News
స్కూల్‌బస్ డ్రైవర్‌కు గుండెపోటు.. స్టీరింగు తిప్పిన విద్యార్థిని
-
Sports News
Iftikhar Ahmed: ఇఫ్తికార్.. 6 బంతుల్లో 6 సిక్స్‌లు
-
Politics News
Yamini Sharma: జగన్ ఇచ్చేది పావలా.. వసూలు చేసేది రూపాయి: యామినీశర్మ
-
World News
Zelensky: ‘జెలెన్స్కీని చంపబోమని పుతిన్ హామీ ఇచ్చారు!’