హయ్యో కృతీ.. ఎంత పని చేశావ్?
‘ఆహా ఏమి ఆ హొయలు.. ఆహా ఏమి ఆ డాన్స్? చించేశావ్ కృతీ..’ అంటూ అభిమానులు ‘పరమ్ పరమ్ పరమసుందరి...’ పాటను పదేపదే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ఈ పాట బ్లాక్‌బస్టర్
‘ఆహా ఏమి ఆ హొయలు.. ఆహా ఏమి ఆ డాన్స్? చించేశావ్ కృతీ..’ అంటూ అభిమానులు ‘పరమ్ పరమ్ పరమసుందరి...’ పాటను పదేపదే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ఈ పాట బ్లాక్‌బస్టర్ అయి కూర్చుంది. 27కోట్ల మంది యూట్యూబ్‌లో వీక్షించారు. కానీ ఇదేపాట ఓ కుర్రాడి చావుకొచ్చింది. తన పేరు పరమ్ఛాయ. ఎప్పుడైతే ఈ పాట బయటికొచ్చిందో అప్పట్నుంచి పాపం అతగాడ్ని పరమ్సుందరి అని ఆట పట్టించడం మొదలుపెట్టారట. ఈ గోల తట్టుకోలేక తను ‘కృతీ.. ఎందుకీ పాట చేశావ్? ఎందుకు నా జీవితాన్ని నాశనం చేశావ్? ఇప్పటికి నన్ను ఓ వెయ్యిసార్లు పరమ్సుందరి అని పిలిచారు. ఈ బాధ తట్టుకోలేకపోతున్నా’ అని ట్వీట్ చేశాడు. దానికి ‘ఊప్స్.. సారీ’ అని రీట్వీట్ చేసి ఫన్నీ ఎమోజీలు జత చేసింది కృతి. మనకు ఇదీ వార్తనే కదా!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!