అన్‌స్టాపబుల్‌ అనన్య!

బోర్‌ అనిపిస్తే.. హెడ్‌సెట్‌ తీస్తారు.. రోటీన్‌గా వినేవి కాకుండా పాశ్చాత్య ట్రాక్స్‌పై పడతారు. మిలీనియల్స్‌ అంతే మరి. అయితే, ఇంగ్లిష్‌లో ట్రాక్స్‌ అంటే  డెమి లొవాటోనో.. మారెన్‌ మొర్సిస్‌.. జెస్టిన్‌ మాత్రమే కాదు. దేశీ వాయిస్‌కీ కనెక్ట్‌ అవుతున్నారు. ఎవరిదా వాయిస్‌? ఇంకెవరూ 23 ఏళ్ల అనన్య బిర్లా. అదిరే లుక్స్‌..

Published : 06 Jul 2019 00:23 IST

ఐకాన్‌ బాక్స్‌

బోర్‌ అనిపిస్తే.. హెడ్‌సెట్‌ తీస్తారు.. రోటీన్‌గా వినేవి కాకుండా పాశ్చాత్య ట్రాక్స్‌పై పడతారు. మిలీనియల్స్‌ అంతే మరి. అయితే, ఇంగ్లిష్‌లో ట్రాక్స్‌ అంటే  డెమి లొవాటోనో.. మారెన్‌ మొర్సిస్‌.. జెస్టిన్‌ మాత్రమే కాదు. దేశీ వాయిస్‌కీ కనెక్ట్‌ అవుతున్నారు. ఎవరిదా వాయిస్‌? ఇంకెవరూ 23 ఏళ్ల అనన్య బిర్లా. అదిరే లుక్స్‌.. ఆకట్టుకునే వాయిస్‌తో ‘అన్‌స్టాపబుల్‌’గా టీన్స్‌ తన మ్యూజిక్‌ ట్రాక్స్‌తో కట్టి పడేస్తోంది. కేవలం పాడటమే కాదు. పాటలు రాస్తుంది. అందులోనూ సమాజ విలువలు ఉండేలా చూసుకుంటోంది. తన మొదటి పాట ‘లివింగ్‌ ది లైఫ్‌’ అధిక ప్రజాదరణ పొందింది. తర్వాత కంపోజ్‌ చేసిన ‘మీన్‌ టు బీ’ సాంగ్‌తో ఇండియన్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీ (ఐఎంఐ) నుంచి ప్రశంసలు అందుకుంది. అది మొదలు.. సర్కిల్స్‌, హోల్డ్‌ ఆన్‌, బ్లాక్‌అవుట్‌, బెటర్‌, అన్‌స్టాపబుల్‌, లవ్‌ సుసైడ్‌, డిస్‌అప్పియర్‌.. పాటలతో కుర్రకారుని ఊపేస్తోంది. పుట్టింది దేశంలోని ధనవంతుల ఇంట్లో. కానీ, వారసత్వంగా వస్తున్న వ్యాపారాలను కాదని తనదైన ప్రత్యేకత చాటుతోంది.
* 17వ ఏట నుంచే సొంతంగా వ్యాపారం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా మూడు విభిన్న వెంచర్లను నడుపుతోంది. తాను స్థాపించిన మైక్రోఫైనాన్స్‌ సంస్థ ద్వారా నిరుపేద మహిళలకు ఆదాయ వనరుల్ని చూపుతోంది.
* ఇంగ్లండ్‌లో చదువుకునే సమయంలో స్టూడెంట్‌ హెల్ప్‌లైన్‌ నంబరును ప్రారంభించి మానసికంగా కృంగిపోతున్న యువతకి కౌన్సెలింగ్‌ ఇచ్చి, వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ‘ఎంపవర్‌’ పేరుతో సంస్థని స్థాపించి తల్లి నీరజతో కలిసి మానసిక సమస్యలతో బాధపడేవారికి బాసటగా నిలుస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు