చూపుల్లోనూ.. అందమే!
కోక కోక కోక కడితే కొరకొరమంటూ చూస్తారు.. పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు.. ఈ పాట కుర్ర నోళ్లలో తెగ నానుతుంది కదా.. ఆ సంగతి పక్కనపెడితే ‘మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిలో
కోక కోక కోక కడితే కొరకొరమంటూ చూస్తారు.. పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు.. ఈ పాట కుర్ర నోళ్లలో తెగ నానుతుంది కదా.. ఆ సంగతి పక్కనపెడితే ‘మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిలో ఏం చూస్తారు?’ అని అడిగింది ‘బెటర్‌హాఫ్’ అనే ప్రముఖ మ్యాట్రిమోనీ వెబ్సైట్. మనోళ్లేం చెప్పారంటే..
* పెళ్లిళ్లు కుదిర్చే వెబ్సైట్లలో పేరు నమోదు చేసుకున్న యువతలో 43శాతం మంది ముందు ఫొటోలోని అమ్మాయి/అబ్బాయి నచ్చిన తర్వాతే ఇతర విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
* 22 శాతం యువత మాత్రం తమ ఈడుకి సరిజోడు అయ్యే అమ్మాయి/అబ్బాయి వయసు వివరాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
* కాబోయే భాగస్వామి జీతం, సంపాదన, ఆస్తుల వివరాలే ముఖ్యమైనవిగా భావిస్తున్న యూత్ 16శాతం.
* ఆసక్తులు, అర్హతలు, అభిరుచులు.. కలిస్తేనే, నచ్చితేనే మేం ముందుకెళ్తాం అనేవాళ్లు వందకి తొమ్మిదిమంది.
* ఈతరంలో వస్తున్న మెచ్చుకోదగిన మార్పు ఏంటంటే.. గత కొన్నేళ్లతో పోలిస్తే ప్రాంతం, కులం, మతం.. ఇలాంటి విషయాలకు తక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారంటోంది ఈ సర్వే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్