చికాకులున్నాయా...

నేటి యూత్‌కి ఎన్ని సరదాలో.. అన్ని చికాకులు. ఎన్ని అవకాశాలో.. అన్ని ఒత్తిళ్లు. ఒంట్లోనే కాదు.. వాళ్ల జీవితాల్లోనూ వేగం ఎక్కువే. అందుకే మానసిక ఒత్తిడిలో కూరుకుపోతున్నారు. రుగ్మతల

Updated : 15 Jan 2022 01:07 IST

నేటి యూత్‌కి ఎన్ని సరదాలో.. అన్ని చికాకులు. ఎన్ని అవకాశాలో.. అన్ని ఒత్తిళ్లు. ఒంట్లోనే కాదు.. వాళ్ల జీవితాల్లోనూ వేగం ఎక్కువే. అందుకే మానసిక ఒత్తిడిలో కూరుకుపోతున్నారు. రుగ్మతల పాలవుతున్నారు. యోగ, ధ్యానం ఈ కష్టాల నుంచి గట్టెక్కిస్తాయంటారు సైకాలజిస్టులు. అలాంటి వాళ్ల కోసం.. ధ్యానం ఎలా చేయాలి? ఏ పద్ధతులు పాటించాలి? ఒత్తిడి ఎలా తగ్గించుకోవాలి? ఒక విషయంపై ఏకాగ్రత కుదరడానికి ఏం చేయాలి? ఇవన్నీ ఆడియో ఫైల్స్‌ ద్వారా వివరిస్తోంది my.headspace.com వెబ్‌సైట్‌. ఇందులో ఉచిత, పెయిడ్‌ కోర్సులున్నాయి. వీటితోపాటు మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి సాంత్వన చేకూర్చేలా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ కూడా ఇస్తారీ వెబ్‌సైట్‌లో.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు