Updated : 22 Jan 2022 06:15 IST
పరిమళానికీ.. ఓ పద్ధతి!
యూత్ అన్నాక స్టైల్‌గా ఉంటారు. టిప్‌టాప్‌గా తయారవుతారు. అన్నిరకాల మెరుగులు దిద్దుకున్నాక ఆఖర్న బాడీ స్ప్రేనో, పెర్ఫ్యూమ్నో.. చల్లుకుంటారు. అప్పటికిగానీ అలంకరణ పూర్తవదు. అయితే ఈ పరిమళాలు ప్రభావవంతంగా, ఎక్కువ సమయం వెదజల్లాలంటే శరీరతత్వానికి అనుగుణంగా స్ప్రే చేసే ప్రాంతాల్ని ఎంచుకోవాలంటారు స్టైలిస్ట్‌లు. వారు చెబుతున్న దాని ప్రకారం...
* చలువ శరీరం: ముంజేయి తగిలేచోట నడుము పక్కన.. మోచేతుల లోపలివైపు.. ఈ ప్రాంతాల్లో స్ప్రే చేయాలి.
* సాధారణం: ఛాతి, మణికట్టు ఈ భాగాల్లో పెర్ఫ్యూమ్ చల్లుకోవాలి.
* వేడి శరీరం: మెడ, భుజాలు, గవద కింది భాగంలో వీటిని రాసుకోవాలి.
* ఎంపిక: కొంతమందికి కొన్నిరకాల ఘాటైన స్ప్రే వాసనలు పడవు. కొన్నిరకాల అలర్జీలు కూడా కలగజేస్తాయి. మార్కెట్లో వీటిని కొనేముందే ఓసారి చేతిపై చల్లుకొని పరీక్షించుకోవాలి.
Advertisement
Tags :