Updated : 05 Mar 2022 00:21 IST

పాక్‌ బీట్‌కి విక్కీ ఫిదా

బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ నిత్య ప్రేమికుడు. నిన్నామొన్నటిదాకా కత్తిలాంటి కత్రినాని ప్రేమించి పెళ్లాడాడు. కెరియర్‌ని నిత్యం ప్రేమిస్తానంటాడు. పుస్తకాలు చదవడంపై ప్రేమ ఎక్కువే. ఇప్పుడు హసన్‌ రహీమ్‌ పాటని తెగ ప్రేమిస్తున్నానంటున్నాడు. తను పాడిన వీడియో ఆల్బమ్‌ ‘జూనా’ని హమ్‌ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘స్టోరీ’ పెట్టాడు. ఇంతకీ ఎవరీ హసన్‌ అంటే.. తను పాకిస్థాన్‌ తాజా గాయక సంచలనం. ‘జంగిల్‌ జవానీ హై యే.. కైసే కహానీ హై యే...’ అంటూ సాగిన ఈ వీడియో సాంగ్‌కి అంతర్జాలంలో ప్రశంసలు కురుస్తున్నాయి. దీనికే ఫిదా అయిన విక్కీ ‘ఈరోజు మూడ్‌ భలే బాగుంది. సరికొత్తగా ప్రారంభం అవుతోంది’ అని క్యాప్షన్‌ జోడించాడు. ఇదేకాదు.. ఈ సంగీత ప్రియుడు గతంలోనూ ప్రఖ్యాత పాక్‌ గాయకుడు నుస్రత్‌ ఫతే అలీఖాన్‌ పాడిన పాటలపై సైతం అభిమానం కురిపించాడు. బాలీవుడ్‌ హీరో పాక్‌ గాయకులపై ఈ అభిమానం చూపడమేంటని కొన్ని కామెంట్లు వచ్చినా ‘సంగీతానికి స్పందించే మనసు ఉంటే చాలు.. దేశం, ప్రాంతం, భాషతో సంబంధం ఏంట’ని ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు విక్కీ అభిమానులు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని