ఒత్తిడి మంచిదే!
‘ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా’, ‘పని భారం మొత్తం నాపైనే పడుతోంది.. ఈ ఉద్యోగం మానేసి వేరేది వెతుక్కోవా లనుకుంటున్నా’ ఇలాంటి నిట్టూర్పులు.. మనం చాలానే వింటుంటాం. నిజానికి కెరియర్లో ఇలాంటి ఒత్తిళ్లు, బాధలు మంచివేనంటారు విశ్లేషకులు. ఎలాగంటే...
* ఉద్యోగంలో చేరిన కొత్తలో పని ఎలా చేయాలో అర్థం కాక, బాస్‌ని ఎలా మెప్పించాలో తెలియక కొంత ఆందోళనకు గురవుతాం. అయినా నేర్చుకోవాలనే తపన, రాణించాలనే కసి ఉండటంతో కొద్దిరోజుల్లోనే ఒత్తిడి మటుమాయమవుతుంది. తొలినాటి రోజుల్లోని ఆ తత్వాన్నే అలవరుచుకుంటే.. ఒత్తిడి పెద్ద ఇబ్బందేం కాదంటారు.
* పని చేస్తున్నప్పుడు పొరపాట్లు, బాస్‌తో చీవాట్లు సహజం. దాన్నే తలచుకుంటూ కూర్చుంటే ఒత్తిడి పెరుగుతుంది. కారణాలు వెతికి, మరోసారి ఆ పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకుంటే రేపటి రోజు కచ్చితంగా బాగుంటుంది. అంటే ఒత్తిడే పరోక్షంగా విజయానికి వారధిగా మారుతుందన్నమాట.
* స్వల్ప, మధ్యస్థాయి ఒత్తిడితో శరీరంలో రోగనిరోధక వ్యవస్థకు మేలు చేసే ‘ఇంటర్ల్యూకిన్స్’ అనే సైటోకైన్ల సముదాయం ఉత్తేజితం అవుతుందంటారు వైద్య పరిశోధకులు. తద్వారా మనం మరింత చురుగ్గా ఉంటూ.. మరింత మెరుగ్గా పని చేస్తాం.
* ఒత్తిడితో తాత్కాలికంగా కొంచెం ఇబ్బంది పడ్డా.. పనిలో అందరికన్నా ముందుండాలనే పోటీ తత్వం, పదోన్నతులు పొందాలనే తపనని ప్రేరేపిస్తుంది. ఉద్యోగి ఒక కంఫర్ట్ జోన్లోనే ఉండిపోకుండా తనకి లక్ష్యాలు నిర్దేశిస్తుంది.
* పని ఎక్కువైతేనే కాదు.. పక్కవాళ్లు త్వరగా పదోన్నతుల నిచ్చెన ఎక్కుతున్నా ఒత్తిడి ఒంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ పోటీలో నేనూ ఉండాలి అనుకునేవాళ్లు కొత్త నైపుణ్యాలు అలవరచుకుంటారు. కష్టపడటం నేర్చుకుంటారు. పదుగురితో అభిప్రాయాలు పంచుకుంటూ సామాజిక బాంధవ్యాలూ మెరుగుపరచుకుంటారు.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
TS TET Results 2022: తెలంగాణ టెట్‌లో ప్రకాశం యువతికి మొదటి ర్యాంకు
-
Related-stories News
Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
-
Ts-top-news News
Hyderabad News: భాజపాకు రూ.20 లక్షలు.. తెరాసకు రూ.3 లక్షలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
-
India News
Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..
-
India News
IRCTC: కప్ టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- CM KCR: తెలంగాణపై కన్నేస్తే.. దిల్లీలో గద్దె దించుతాం!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్‌బాబు
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
- Assigned: ఎసైన్డ్ వ్యవసాయ భూములపై యాజమాన్య హక్కులు?