గుర్తొస్తే.. ఇప్పటికీ ఏడుపాగదు!

కశ్మీర్‌ ఫైల్స్‌.. సినిమా.. ఇప్పుడో సంచలనం. వివాదాల నిప్పు రాజేస్తున్ననేపథ్యం. ఆ సంగతి అలా ఉంచితే అందులోని నటీనటుల నటనకి చప్పట్లు కొట్టని ప్రేక్షకుడు లేడు.

Updated : 26 Mar 2022 04:48 IST

కశ్మీర్‌ ఫైల్స్‌.. సినిమా.. ఇప్పుడో సంచలనం. వివాదాల నిప్పు రాజేస్తున్ననేపథ్యం. ఆ సంగతి అలా ఉంచితే అందులోని నటీనటుల నటనకి చప్పట్లు కొట్టని ప్రేక్షకుడు లేడు. అందులో సీనియర్లకు ఏమాత్రం తగ్గకుండా మెప్పించాడు దర్శన్‌కుమార్‌. అతడి వ్యక్తిగతం,  సినీ ప్రయాణం..

నేపథ్యం: పూర్తిపేరు దర్శన్‌ ఘన్‌దాస్‌ కుమార్‌. దిల్లీ కుర్రాడు. 2013లో సల్మాన్‌ఖాన్‌ సినిమా ....లో చిన్న పాత్రతో తెరంగేట్రం చేశాడు. ‘మేరీకోం’లో ముఖ్యపాత్ర పోషించి వెలుగులోకి వచ్చాడు.

గాడ్‌ఫాదర్‌: నసీరుద్దీన్‌ షాని గురువుగా భావిస్తాడు. ‘మోట్లే ప్రొడక్షన్‌’లో శిక్షణ తీసుకుంటున్నప్పుడు పరిచయం.

కలల లోకంలోకి: దిగువ మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పట్నుంచే సినిమాలంటే ప్రాణం. టీనేజీలోనే సొంతంగా వీడియోలు, షార్ట్‌ఫిల్మ్‌లు తీశాడు. కలల్ని వెతుక్కుంటూ కౌమారంలోనే ముంబయిలో వాలిపోయాడు.

గుర్తింపు: ఎన్‌హెచ్‌ 10, తూఫాన్‌, ఫ్యామిలీమ్యాన్‌ వెబ్‌సిరీస్‌లు.

ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోయర్లు: 7 లక్షలు

మెచ్చే నటీనటులు: హృతిక్‌ రోషన్‌, కియారా అద్వానీ. గాయకుడు అరిజిత్‌ సింగ్‌.

తప్పని దినచర్య: జిమ్‌కెళ్లి కార్డియో, బైసెప్స్‌ వ్యాయమాలు చేయడం.

ఇష్టపడేది: బైక్‌ రైడింగ్‌. ఒంటరిగా హిల్‌స్టేషన్లకు వెళ్తుంటాడు. మూగజీవాలంటే ప్రేమ. ఇన్‌స్టాలో ఫాలోయర్లకు ఫ్యాషన్‌ సలహాలిస్తాడు.

శిక్షణ: నటుడిగా రాటుదేలేందుకు నీనాగుప్తా నడిపిస్తున్న ‘సహెజ్‌ థియేటర్‌ ఆర్ట్స్‌’లో శిక్షణ పొందాడు. కొన్నాళ్లు మోడలింగ్‌ చేసి సినిమా బాట పట్టాడు.

పాత్రల కోసం: పాత్రల కోసం తపించే రకం. సరబ్‌జిత్‌ పాత్ర కోసం ఉర్దూ నేర్చుకున్నాడు. తూఫాన్‌ కోసం మూడునెలలు బాక్సర్‌ అయ్యాడు. ఫ్యామిలీమ్యాన్‌ కోసం పాకిస్థాన్‌ చరిత్ర చదివాడు. కశ్మీర్‌ ఫైల్స్‌ చేసేముందు పదుల సంఖ్యలో కశ్మీరీ పండిట్‌ కుటుంబాలతో సావాసం చేశాడు.

మర్చిపోలేనిది: కశ్మీర్‌ ఫైల్స్‌లో కృష్ణ పండిట్‌ పాత్ర రెండువారాలు వెంటాడిందట. ఆ పాత్ర, నేపథ్యం గుర్తొచ్చినప్పుడల్లా అప్రయత్నంగా కళ్లలో నీళ్లు తిరుగుతూ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయేవాడట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని