తగ్గడమే లే..!

మనిషి సంఘజీవి అయితే కుర్రకారు సామాజిక మాధ్యమ జీవులు! అంతర్జాలం లేకుండా రోజు గడవట్లేదు మరి. తాజా గణాంకాల మాటేంటి?  అని లెక్కలు తీసింది ప్రముఖ సోషల్‌మీడియా మార్కెటింగ్‌ సంస్థ. ఇదిగోండి వివరాలు. 

Updated : 23 Apr 2022 04:18 IST

మనిషి సంఘజీవి అయితే కుర్రకారు సామాజిక మాధ్యమ జీవులు! అంతర్జాలం లేకుండా రోజు గడవట్లేదు మరి. తాజా గణాంకాల మాటేంటి?  అని లెక్కలు తీసింది ప్రముఖ సోషల్‌మీడియా మార్కెటింగ్‌ సంస్థ. ఇదిగోండి వివరాలు. 

వాట్సాప్‌దే కిరీటం

48.5 కోట్లు

ఎస్సెమ్మెస్‌లు పంపుకోవాలంటే ఇప్పుడు వాట్సాప్‌ మాత్రమే అనేంతవరకు వచ్చేసింది పరిస్థితి. అందుకే మరి రోజుకి వందకోట్ల సందేశాలను బట్వాడా చేస్తోందీ యువ వారధి. ఆడియో, వీడియో కాల్స్‌ దీనికి అదనం. ఇంక ఫొటోలు, వీడియోలు ఇచ్చిపుచ్చుకోవడాలు షరా మామూలే. అన్నీ అనుకూలతలు గనకే భారత్‌లో అత్యధికంగా వాట్సాప్‌ని వాడుతున్నారు. 


ఆల్‌రౌండర్‌ యూట్యూబ్‌

46.7 కోట్లు

యూట్యూబ్‌ అంటే వాడుకున్నోళ్లకు వాడుకున్నంత! సంగీతం, సమాచారం, వీడియోలు, సినిమాలు, ఛానెళ్లు..ఇక్కడ దొరకనిదంటూ ఉండదు. అన్నింటికీ మించి ఇదో కాసుల గని. ప్రతిభ, సృజనాత్మకత చూపించి దీన్ని సంపాదనకు మార్గంగా మలచుకుంటున్నవాళ్లు బోలెడు. ప్రతి ఒక్కరూ ఓ ఛానెల్‌ పెట్టేసి దీన్ని కాసులు పిండుకునే యంత్రంగా మలచుకునే వెసులుబాటు ఉండటంతో రెండోస్థానంలో ఉంది.


వన్నె తగ్గని ఫేస్‌బుక్‌

33.1కోట్లు

పాతబడిపోయింది.. పనైపోయింది అని భావిస్తుండొచ్చుగాక... ఇప్పటికీ యువతలో ఫేస్‌బుక్‌ హవా తగ్గలేదు. ప్రపంచంలోని మొత్తం యూజర్లలో మన కుర్రకారు వాటా పదిశాతం. పేజీలు సృష్టించడం, దీన్ని వ్యాపారలావాదేవీలకు వేదికగా మలచడం, పొట్టి వీడియోలు.. ఇలాంటి మార్పులతో ఇంకా ఈతరాన్ని ఇంకా ఆకర్షిస్తూనే ఉంది. 


జోరందుకుంటున్న ఇన్‌స్టాగ్రామ్‌

23.05 కోట్లు 

ఫొటోలతో కనికట్టు చేయాలి.. నా ప్రతిభ జనాలకు తెలియాలి అనుకునే అమ్మాయిలు, అబ్బాయిలు ఇన్‌స్టాకి ఓటేస్తున్నారు. పొట్టి వీడియోల ‘రీల్స్‌’ సైతం యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. పేరు, ఫేమ్‌ సంపాదించుకున్న ‘ఇన్‌ఫ్లుయెన్సర్లు’ అయితే ఈ మాధ్యమాన్ని సంపాదనకు మార్గంగా మలచుకుంటున్నారు. ఇక తారలు మెచ్చే మొదటి మాధ్యమం ఇదే. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు