సంతోషానికి 3 సూత్రాలు

మనం ఏం చేసినా... సంతోషంగా ఉండటానికే, సంతృప్తిగా జీవించడానికే. మరి ఏం చేస్తే ఆనందం మన వెంట వస్తుంది? రామచంద్ర మిషన్‌ ఆధ్యాత్మిక గురువు కమలేష్‌ పటేల్‌ (దాజీ) మాటల్లో..

Published : 30 Apr 2022 02:23 IST

మనం ఏం చేసినా... సంతోషంగా ఉండటానికే, సంతృప్తిగా జీవించడానికే. మరి ఏం చేస్తే ఆనందం మన వెంట వస్తుంది? రామచంద్ర మిషన్‌ ఆధ్యాత్మిక గురువు కమలేష్‌ పటేల్‌ (దాజీ) మాటల్లో..

* ఇవ్వడంలో ఉన్న ఆనందం మరెందులోనూ దొరకదు. అందులోనూ గుప్తంగా ఇవ్వడం మరింత సంతృప్తిని కలగజేస్తుంది. అవసరాల్లో, ఆపదల్లో ఉన్నవాళ్లకి డబ్బు, సమయం, మాట, ప్రేమ ఇస్తుంటే.. కలిగే ఆనందం అనంతం. శరీర కండరాలకు వ్యాయామం ఎంత అవసరమో, మంచి హృదయ లక్షణాలకు సాయం చేసే వ్యాయామం అవసరం.

* ‘కృతజ్ఞత చూపడం మానవజాతి నైతిక జ్ఞాపకం’ అంటారు సామాజిక శాస్త్రవేత్త జార్జ్‌ సిమెల్‌. ఇది మనుషులు, మనసుల మధ్య బంధాన్ని దృఢం చేస్తుంది. జీవితంలో సంపూర్ణ సంతృప్తిని పెంచుతుంది. సహోద్యోగికి, ఇల్లాలికి, మన కోసం శ్రమించే సిబ్బందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెబితే కలిగే అనుభూతి చెప్పలేనంత హాయినిస్తుంది.  

* చాలామంది భవిష్యత్తులో సుఖపడటానికి వర్తమానంలో కష్టపడుతుంటారు. కానీ రేపటి రోజుకి వర్తమానం గతం అవుతుంది. కాబట్టి రేపటి బెంగలు మాని వర్తమానంలో జీవించాలి. ‘ఆనందం సీతాకోక చిలుకలాంటిది.. దానిని వెంబడిస్తే, ఎప్పటికీ మనకు చిక్కదు. కానీ నిశ్శబ్దంగా కూర్చుంటే.. మనపై వచ్చి వాలుతుంది. అందుకే చేసే ప్రతి పనిని, ఉన్న స్థితిని అనుక్షణం ఆనందించాలి. గడ్డు పరిస్థితుల్లోనూ మంచిని వెతుక్కోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని