మిలమిల.. మిర్రర్‌ సెల్ఫీ

తెర మీద కనిపించే తారల నుంచి కళాశాల ప్యారీలదాకా ఇప్పుడంతా మిర్రర్‌ సెల్ఫీలతో చెలరేగిపోతున్నారు. అద్దం ముందు నిల్చొని పోజు కొట్టి, దిగిన ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తున్నారు. మరి ఈ సెల్ఫీలు బాగా కుదరాలంటే ఏం చేయాలి?

Published : 14 May 2022 00:40 IST

తెర మీద కనిపించే తారల నుంచి కళాశాల ప్యారీలదాకా ఇప్పుడంతా మిర్రర్‌ సెల్ఫీలతో చెలరేగిపోతున్నారు. అద్దం ముందు నిల్చొని పోజు కొట్టి, దిగిన ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తున్నారు. మరి ఈ సెల్ఫీలు బాగా కుదరాలంటే ఏం చేయాలి?

* నిలువుటద్దాన్ని కొంచెం వెనక్కి వంచి, ఛాతీ భాగం నుంచి సెల్ఫీ తీస్తే నిఖార్సైన మిర్రర్‌ సెల్ఫీని ఒడిసి పట్టుకోవచ్చు.

* మెడను సాగదీసి, తలను కొంచెం పక్కకి వంచి.. గదవని కొంచెం ముందుకు తీసుకొచ్చి క్లిక్‌మనిపిస్తే.. మోడల్‌లా పోజు పెట్టి సెల్ఫీ తీసినట్టే. 

* నిలువెత్తు సెల్ఫీ తీసుకోవాలనుకునేవాళ్లు.. ముఖ్యంగా ఆకర్షణీయంగా కనిపించాలి అనుకునే అమ్మాయిలు.. నిటారుగా కాకుండా, ఒకే పక్కకి ఒరిగిపోయి నిల్చోకుండా ‘ఎస్‌’ ఆకారంలో ఉండాంటారు.

* మంచి పోజు పెట్టినా, ఖరీదైన ఫోన్‌ వాడినా.. సెల్ఫీ తీసుకునేచోట సరైన వెలుతురు లేకపోతే ప్రయోజనం ఉండదు. అయితే ఈ లైటింగ్‌ అద్దం, ఫోన్‌ తెరపై నేరుగా పడొద్దు.

* ఎంత ప్రయత్నించినా ఒక్కోసారి ముఖంలో హావభావాలు పలికించలేం. అలాంటప్పుడు ముఖం కవర్‌ చేసేలా ఫోన్‌ అడ్డంగా పెట్టాలి. ప్రశాంతంగా కింద కూర్చొని సెల్ఫీ తీసుకోవాలి. ఇదో కొత్తరకం ప్రయోగం. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని