బైకంటే.. ప్రేమంట

బండిని గాళ్‌ఫ్రెండ్‌లా భావించే కుర్రాళ్లుంటారు. బెస్టీలా చూసే అబ్బాయిలూ కనిపిస్తారు. ‘ద్విచక్రవాహనంతో యువతకి ఎందుకింత అనుబంధం?’ అని ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ దేశంలోని ఆరు నగరాల్లో

Published : 14 May 2022 00:53 IST

బండిని గాళ్‌ఫ్రెండ్‌లా భావించే కుర్రాళ్లుంటారు. బెస్టీలా చూసే అబ్బాయిలూ కనిపిస్తారు. ‘ద్విచక్రవాహనంతో యువతకి ఎందుకింత అనుబంధం?’ అని ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ దేశంలోని ఆరు నగరాల్లో అధ్యయనం చేసింది. వాళ్లేం చెప్పారంటే.. 

వేగం: మోటార్‌సైకిళ్లలో కుర్రకారుని అత్యధికంగా ఆకట్టుకునేది వేగం. కళ్లు మూసి తెరిచేలోగా వంద కిలోమీటర్ల వేగం అందుకోవడం వాళ్లకి కావాలి. గాల్లో తేలిపోతుంటే.. వాళ్లు పొందే అనుభూతి మరెక్కడా దొరకదట. అందుకే వేగం, మేటి పికప్‌ ఉన్నవాటినే ఇష్టపడుతున్నారు.

స్టైల్‌: బడ్జెట్‌ చిన్నదైనా, పెద్దదైనా.. కుర్రాళ్లు ఉన్నంతలో ఆకర్షణీయంగా ఉండే బైక్‌ని కోరుకుంటున్నారట. రూపం నచ్చితే మైలేజీ, ధర విషయంలోనూ రాజీ పడతాం అంటున్నారు. 

శబ్దం: ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. బండి ఇంజిన్, ఎగ్జాస్ట్‌ నుంచి వెలువరించే శబ్దం నచ్చితే చాలు.. దాన్ని కొనుక్కునే యూత్‌కి లెక్కేలేదు. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ‘బుల్లెట్‌’, బజాజ్‌ ‘పల్సర్‌’ మోడళ్లు ఇలా పల్స్‌ పట్టినవేనట. 

పోజు: తమ యాటిట్యూడ్‌ చూపించుకోవడానికి అనువుగా ఉండేది బైక్‌ అనే నమ్ముతున్నారు చాలామంది. రివ్వున దూసుకెళ్తూ పోజు కొట్టడానికి, రోడ్డుపై ‘అన్నీ’ కవర్‌ చేయడానికి బెస్టీలను వెనకేసుకొని తిరగడానికి ద్విచక్రవాహనం కారుకన్నా అనుకూలమని వారి అభిప్రాయం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని