యువోద్యోగులూ.. వినండి

కాలేజీ కుర్రాళ్లైనా.. కొలువు చేసే యువ ఉద్యోగులైనా.. చాటింగ్‌లో, సందేశాల్లో ఎమోజీలను ఎడాపెడా వాడేసేవారే. ఈ అలవాటుని పైస్థాయి అధికారులతో ఆన్‌లైన్‌, ఈమెయిల్‌ లావాదేవీల్లో కొనసాగిస్తే అసలుకే మోసం అంటోంది ఓ అధ్యయనం. ఈ

Published : 28 May 2022 01:11 IST

యువ నాడి

కాలేజీ కుర్రాళ్లైనా.. కొలువు చేసే యువ ఉద్యోగులైనా.. చాటింగ్‌లో, సందేశాల్లో ఎమోజీలను ఎడాపెడా వాడేసేవారే. ఈ అలవాటుని పైస్థాయి అధికారులతో ఆన్‌లైన్‌, ఈమెయిల్‌ లావాదేవీల్లో కొనసాగిస్తే అసలుకే మోసం అంటోంది ఓ అధ్యయనం. ఈ అలవాటు ఉన్నవాళ్లలో ప్రతిభ, సామర్థ్యాలు తక్కువగా ఉంటాయని యాజమాన్యాలు భావిస్తాయట. ‘ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌ అండ్‌ హ్యూమన్‌ డెసిషన్‌ ప్రాసెస్‌’ పేరుతో టెల్‌ అవీవ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయనకారులు ఈ వివరాలు ప్రచురించారు. ‘ఎమోజీలు అతిగా వాడేవారి మనస్తత్వం సున్నితంగా ఉంటుంది. ఇతరులు తమని గుర్తించాలనీ, సన్నిహితంగా ఉండాలని కోరుకుంటారు. మానసికంగా దృఢంగా ఉన్నవారు విషయాన్ని సూటిగా, స్పష్టంగా తమ మాటల్లో, అక్షరాల్లో చెబుతారు’ అంటున్నారు ఆ పరిశోధకులు. అందుకే ఆఫీసు ఈమెయిళ్లు, జూమ్‌ ప్రొఫైళ్లలాంటి వాటిలో ఎమోజీలు వాడొద్దని సలహా ఇస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని