బయోలు.. అభయాలు!
ముఖం చూసి మనసులో ఏముందో కనిపెట్టేయడం కష్టం. కానీ ఇన్‌స్టాగ్రామ్ ‘బయో’ చూసి వాళ్ల మనస్తత్వం ఏంటో ఇట్టే పట్టేయొచ్చు అంటారు. మరి మనకిష్టమైన కొందరి తారల మనసుల్లో, బయోల్లో ఏముంది?
‘మనస్ ఏకం.. వచస్ ఏకం.. కర్మణ్యేకం మహాత్మనామ్’ - విజయ్ దేవరకొండ
సోది లేకుండా చెప్పాలంటే.. మనసు చెప్పింది విను.. కష్టపడి పని చెయ్.. ఫలితం దానంతట అదే వస్తుంది అని. తను ఎవరి అండదండలు లేకుండా కష్టపడి ఒక స్టార్ హోదా అందుకున్నాడుగా మరి.
‘త్రో హ్యాపీనెస్ ఎరౌండ్ లైక్ ఏ కాన్ఫెటీ’ - రకుల్‌ప్రీత్ సింగ్
రంగురంగుల కాగితాల్లా నీ చుట్టూ సంతోషాల్ని వెదజల్లుమంటోంది రకుల్‌ప్రీత్. మనం సంతోషంగా ఉంటే, చుట్టుపక్కలా ఉండేలా చూస్తే.. అంతకుమించిన సానుకూల దృక్పథం ఏముంటుంది.
‘మూవీస్ సూపర్ కార్స్ టెక్నో’ - నాగచైతన్య
సూటిగా సుత్తి లేకుండా నాకు సినిమాలు, సూపర్ కార్లు, టెక్నాలజీ ఇష్టమని చెప్పేశాడు చై. తను ఓ రేసర్ కూడా అని దీని ద్వారా చాలామందికి తెలిసింది.
‘అట్లాస్ హ్యాండ్స్’ - పూజా హెగ్డే
ఈ బయోని అర్థం చేసుకోవడం కష్టం అనుకుంటే.. ఈ బుట్టబొమ్మకి అత్యంత ఇష్టమైన సాంగ్ ఏంటో తెలిస్తే జవాబు తేలిగ్గానే తెలిసిపోతుంది. అదే.. బెంజమిన్ ఫ్రాన్సిస్ పాడిన ‘అట్లాస్ హ్యాండ్స్’.
‘థింగ్స్ ఆర్ ఆల్వేస్ ఇంపాజిబుల్, రైట్ ఆప్ అంటిల్ దే ఆర్ నాట్’ - సమంతా
ఒక పని పూర్తయ్యేవరకు, ఒక విజయం సాధించే వరకు అవి ఎప్పటికీ కష్టసాధ్యంగానే అనిపిస్తాయి అని. కష్టపడితే సాధ్యం కాని పనేదీ లేదని పరోక్షంగా చెబుతోంది సామ్.
‘బీ ఏ మిరకిల్’ - రష్మికా మందన్న
నలుగురిలో ఒకరిలా కాకుండా నువ్వో అద్భుతంలా ఉండాలి అన్నది ఈ అమ్మడి మాట. మనపై మనం నమ్మకం పెట్టుకొని, బాగా కష్టపడితే ఈ అద్భుతం సాధ్యమేనని పరోక్షంగా చెబుతుందన్నమాట.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
-
India News
Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
-
Viral-videos News
Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
-
India News
Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాల కేసులో షార్ప్‌షూటర్ అరెస్టు
-
Sports News
IND vs ENG: శ్రేయస్‌ను తెలివిగా బుట్టలో వేసిన ఇంగ్లాండ్.. వీడియో చూడండి
-
Movies News
Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- IND vs ENG: నాలుగో రోజు ముగిసిన ఆట.. భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సిందే!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
- Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
- Tamil Nadu: తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి.. సంచలన వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ
- News In Pics: చిత్రం చెప్పే సంగతులు
- కొత్త పెళ్లికూతుళ్లు.. వీటి గురించే తెగ వెతికేస్తున్నారట!