గెలుపు అజెండా..

తాజా అధ్యయనం ప్రకారం గడిచిన ఐదేళ్లలో.. దేశంలో ప్రారంభమైన మొత్తం అంకుర సంస్థల్లో 11 శాతం మాత్రమే లాభాల బాట పట్టాయి. వీటిని ముందుండి నడిపించిన విజేతల్లో ఉండే లక్షణాలేంటని ఆరా తీస్తే..

Updated : 11 Jun 2022 01:18 IST

స్ఫూర్తి కెరటం

తాజా అధ్యయనం ప్రకారం గడిచిన ఐదేళ్లలో.. దేశంలో ప్రారంభమైన మొత్తం అంకుర సంస్థల్లో 11 శాతం మాత్రమే లాభాల బాట పట్టాయి. వీటిని ముందుండి నడిపించిన విజేతల్లో ఉండే లక్షణాలేంటని ఆరా తీస్తే..

నిరంతర ఆలోచనలు: సంస్థ మనుగడ, అవకాశాలు అందిపుచ్చుకోవడం కోసం విజేతలు రోజురోజుకీ కొత్త ఆలోచనలు చేస్తూనే ఉంటారు. ప్లాన్‌ ఏ విఫలమైతే.. ఈ ఔత్సాహికుల దగ్గర బి, సి, డి.. ఇలా లెక్కలేనన్ని ప్రత్యామ్నాయాలుంటాయి.

తీరిక ఉండదు: ఖాళీగా ఉండటం.. సరదాగా గడపడం.. వీళ్ల డిక్షనరీలోనే ఉండదు. నిరంతరం ఆలోచిస్తుంటారు, అన్వేషిస్తారు. ఈ పనిమంతులు పని పూర్తయ్యేవరకు ఓ పట్టాన కదురుగా ఉండరు.

వదిలేయరు: ఎంత గొప్పవారికైనా పట్టినదంతా బంగారం కాదు. ప్రతి ఒక్కరికీ ఓటములుంటాయి. అయినా వీళ్లు కడవరకూ ప్రయత్నించిగానీ కాడి వదిలేయరు. ఓటమి తొందరగా ఒప్పుకునే రకం కాదు. వందశాతం పోరాడతారు.

నేర్చుకునే గుణం: అన్నీ నాకే తెలుసు.. నేనే మోనార్క్‌ అనే గుణం అస్సలు ఉండదు. కార్యాలయంలో అటెండరు నుంచి పెద్ద కంపెనీ సీఈవో వరకు.. ప్రతి ఒక్కరి నుంచీ నేర్చుకోవాలని భావిస్తుంటారు. కొత్త విషయం కనుగొనాలని తపిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని