బదులివ్వు..బాధలు తగ్గించు
పెరిగిన వాతావరణమో, స్వతహాగా వచ్చిన సిగ్గో.. అమ్మాయిలకు నేనెప్పుడూ దూరం. కానీ పీజీలో ఒక్కసారిగా నా తీరు మారింది. కారణం.. నా సహాధ్యాయి. తరగతిలో తనని మొదటిసారి చూడగానే నా గుండెలో గిటార్లు మోగాయి. నా కాళ్లు తన వెనకాలే తిరగసాగాయి. తనూ స్పందించేది. అప్పుడప్పుడు చూపులు.. ఎప్పుడో ఓసారి పలకరింపులు. అంతే. దానికే ఎవరెస్టుని జయించినంత సంతోషం. కొన్నాళ్లకు చదువు పూర్తై మేం ఇళ్లకు చేరాం. అయినా నా మనసు ఆమె చుట్టే తిరిగేది. ఉండబట్టలేక ఫేస్‌బుక్‌లో పలకరించేవాణ్ని. ఓసారి ధైర్యం చేసి నెంబరడిగా.. ఇచ్చింది. పలకరింపులు, సాన్నిహిత్యం మరింత పెరిగాయి. నేనేం చేయాలో, ఏం చేయకూడదో చొరవగా చెప్పేది. కనికట్టు చేసినట్టు అన్నీ పాటించేవాణ్ని. ఆమెని ముద్దుగా ‘రాణి’ అనేవాణ్ని.
నా మనసు కొలనులో రాణి ఎప్పుడో పూవై పూసింది. తనతో పెళ్లి, పిల్లలు, భవిష్యత్తు.. ఎన్నో ఊహించుకున్నా. ఆ ఫీలింగే చెప్పలేనంత కిక్‌నిచ్చేది. మరి ప్రేమిస్తున్నానంటే తను ఒప్పుకుంటుందా? పెద్దలేమంటారు?.. ఏవేవో సందేహాలు. దానికీ సిద్ధమయ్యా. తనని జీవితాంతం ప్రేమగా చూసుకోవాలి. పైసా కట్నం అడగొద్దు. అవసరమైతే నేను దాచుకున్న రూ.7 లక్షలూ ఇచ్చేద్దాం.. అని. ఆ మాట చెబుదామని చాలాసార్లు రిహార్సల్స్ వేసుకొన్నా. చివరికి, ఆకాశంలో చంద్రుడు నిండుగా వెలుగుతున్న ఓ పౌర్ణమి రోజు.. నా జాబిలికి ఫోన్ ద్వారా ప్రేమ సందేశం పంపా. ఆపై నా కళ్లన్నీ ఫోన్‌కే అప్పగించా. ‘ఏంటీ ప్రేమా? నేనెప్పుడైనా ఆ మాట చెప్పానా? అలా ప్రవర్తించానా?.. నాకా ఉద్దేశమే లేదే’ అంది. ఆ క్షణమే నా గుండె ఆగిపోతే బాగుండు అనిపించింది. ఆ రాత్రి నా కంటిరెప్పలు వాలలేదు.
కొన్నాళ్లకి బావ నాకో సంబంధం తెచ్చారు. నా ప్రేమ, గుండెలోని బాధనంతా ఆయన ముందుంచా. ‘నువ్వు ప్రేమించావు సరే.. తను ఒప్పుకోపోతే చేసేదేముంది? ఆ అమ్మాయిని మర్చిపో’ అన్నారు. మర్చిపోవడానికి నాదేమైనా మామూలు ప్రేమా? రాణిని నా గుండెల్లో ప్రతిష్టించుకుంటేనూ! ఈలోపు అమ్మకి విషయం తెలిసింది. ‘నీ ప్రేమ విషయంలో మాకేం అభ్యంతరం లేదు. ఆ అమ్మాయి ఒప్పుకుంటే తనతోనే పెళ్లి చేస్తాం’ అంది. నాకింతకన్నా ఏం కావాలి? సంతోషంగా గబగబా రాణికి ఫోన్ కలిపా. ఈసారీ కరుణించలేదు. పాత పాటే పాడింది. ఇంట్లోవాళ్లకి కొంత సమయం ఇవ్వమని చెప్పా. కానీ ఎంత చేసినా రాణి మనసు కరగట్లేదు. నా పద్ధతి నచ్చక అమ్మ నాతో మాట్లాడ్డం మానేసింది. ఒక్కోసారి ఆలోచిస్తే నా ప్రేమ కారణంగా ఇంతమందిని క్షోభ పెట్టడం సరికాదనిపించేది. రాణిని మర్చిపోవాలని, తన ఊసు తేవొద్దని చాలాసార్లు అనుకునేవాణ్ని. ప్చ్.. నాల్రోజులు గడిస్తే మళ్లీ అదే తీరు.
ఏళ్లు గడుస్తున్నాయి. రాణిని వదిలేయాలా? వద్దా? అనే విషయంలో ఊగిసలాడుతూనే ఉన్నాను. కానీ మేం సన్నిహితంగా ఉన్నరోజుల్లో తను నాపై చూపించిన ఆపేక్ష, చూపులు, మాటలు.. గుర్తుకు తెచ్చుకుంటే తనకి నాపై ప్రేమ ఉందేమో అనిపిస్తోంది. ఏదో కారణంతో నన్ను వద్దనుకుంటోందని నా అనుమానం. అన్నింటికీ మించి తను నన్ను కాదనుకొని వేరొకరి సొంతం అవుతుందనే ఊహే భరించలేకపోతున్నా. ‘రాణీ.. నేను నిన్ను ప్రాణంలా ప్రేమిస్తూనే ఉన్నా. సదా నీ క్షేమం కోరేవాడిని. నీ మనసు గెలుచుకోవాలని ప్రాధేయపడటమే తప్ప.. నిన్నెలాగైనా సొంతం చేసుకోవాలనే దురభిమానం నాకు లేదు. నీకోసం ఎన్నాళ్లైనా ఎదురుచూస్తాను. ఎంతమందినైనా ఒప్పిస్తాను. కానీ దయచేసి నీ జీవితంలో నాకు ఎందుకు చోటు ఇవ్వలేకపోతున్నావో చెప్పు. ఏమైనా ఇబ్బందులుంటే నేను పరిష్కరిస్తాను. దయచేసి ఒక్కసారి బదులివ్వు’.
- ప్రకాశ్
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
CWG 2022: మేం రజతం గెలవలేదు.. స్వర్ణం కోల్పోయాం: శ్రీజేశ్
-
General News
IVF: ఐవీఎఫ్ విఫలమయితే ఎలా...! ఇక సంతానం కష్టమేనా..?
-
Politics News
Chandrababu: ఆంబోతులు బట్టలిప్పి తిరుగుతుంటే చూస్తూ ఉండాల్సి వస్తోంది: చంద్రబాబు
-
India News
Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
-
Sports News
Serena William: టెన్నిస్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నా: సెరీనా విలియమ్స్
-
Politics News
Shashi Tharoor: విదేశీ పార్లమెంట్లలోనే ప్రధాని ఎక్కువగా మాట్లాడతారు: శశిథరూర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- ప్రతి విమాన సంస్థా ఆ జాబితా ఇవ్వాల్సిందే.. ఆర్థిక నేరగాళ్లకు చెక్ పెట్టేందుకేనా?
- Jaishankar: సరికొత్త ఆలోచనలతో చకచకా చేస్తున్నారు.. సిబ్బందికి కేంద్ర మంత్రి ప్రశంసలు
- Whatsapp: వాట్సాప్ నుంచి ప్రైవసీ ఫీచర్లు.. ఇక మీ ‘జాడ’ కనిపించదు!
- Nitish kumar: బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
- Nithiin: అందుకే మా సినిమాకు ‘మాచర్ల నియోజకవర్గం’ టైటిల్ పెట్టాం!
- Bihar politics: భాజపాకు నీతీశ్ కుమార్ ఝులక్.. నెట్టింట మీమ్స్ హల్చల్