‘హంటర్‌’లా దూసుకెళ్దాం..

‘రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌’.. ఈ పేరు వింటేనే కుర్రాళ్ల ఒంట్లో వైబ్రేషన్లు మొదలవుతాయి. ‘డుగ్‌డుగ్‌డుగ్‌...’ అంటూ ఆ కంపెనీ బైక్‌లు చేసే శబ్దానికి పులకించిపోతుంటారు. అందుకే మరి.. 350సీసీ విభాగంలో ‘క్లాసిక్‌’, ‘బుల్లెట్‌’ మోడళ్లు అత్యధికంగా

Updated : 18 Jun 2022 05:32 IST

‘రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌’.. ఈ పేరు వింటేనే కుర్రాళ్ల ఒంట్లో వైబ్రేషన్లు మొదలవుతాయి. ‘డుగ్‌డుగ్‌డుగ్‌...’ అంటూ ఆ కంపెనీ బైక్‌లు చేసే శబ్దానికి పులకించిపోతుంటారు. అందుకే మరి.. 350సీసీ విభాగంలో ‘క్లాసిక్‌’, ‘బుల్లెట్‌’ మోడళ్లు అత్యధికంగా అమ్ముడవుతుంటాయి. ఈ సెగ్మెంట్‌లోనే వస్తోంది ‘హంటర్‌ 350’. మోడల్‌ ప్రకటించింది మొదలు.. దీనిపై అంతా ఆసక్తి నెలకొంది. ఆగస్టు 8న ఈ కొత్త బండి జనం మధ్యలోకి వస్తుందని ప్రకటించింది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.
* ఇది 349సీసీ సింగిల్‌ సిలిండర్‌ బైక్‌. 20.2పీఎస్‌ 27ఎన్‌ఎం.. సాంకేతికాంశాలు.
* గుండ్రని హెడ్‌ల్యాంప్‌, టియర్‌డ్రాప్‌ ఆకారంలోని ఇంధన ట్యాంకు, ముందు నుంచి చివరిదాకా ఒకే సీటుతో సరికొత్త డిజైన్‌తో వస్తోంది.
* ట్రయంఫ్‌ స్ట్రీట్‌ ట్విన్‌, జావా 42, హోండా సీబీ350ఆర్‌ఎస్‌ పోటీదారులు.
* అత్యధిక వేగం 125కి.మీ./గం. ధర రూ.1.70లక్షలు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని