Published : 20 Jul 2019 00:38 IST

సీజన్‌తో స్మార్ట్‌గా..!

ఫ్యాషన్‌  హుడెడ్‌ టీ

వర్షాకాలం వచ్చిందంటే చాలు యువత టోపీలు, జాకెట్‌లపై తెగ మక్కువ చూపుతుంది. ఈ కాలంలో వచ్చే చల్లని గాలులను తట్టుకోవటంతో పాటు ట్రెండీ లుక్‌తో ప్యాషన్‌ ప్రపంచాన్ని ఏలేస్తాయివి.

 

మ్యాక్‌
ప్యాషన్‌ ప్రపంచంలో రారాజుగా వెలుగుతున్న డ్రెెస్సింగ్‌లో మ్యాక్‌ ఒకటి.. సెలెబ్రిటీల స్థాయి నుంచి సాధారణ యువత వరకు ఈ ట్రెండ్‌ తెగ నచ్చేస్తోంది. తక్కువ బరువుంటూ, సింపుల్‌గా కనిపిస్తాయి. ఆఫీస్‌కి వెళ్లే ఉద్యోగులకు ఇవి పర్‌ఫెక్ట్‌ ఛాయిస్‌..


బాంబర్‌ జాకెట్‌
తక్కువ బరువుతో చూడటానికి ట్రెండీగా కనిపిస్తాయి ఈ జాకెట్‌లు. ఈదురు గాలుల నుంచి వచ్చే దుమ్ము, ధూళిని జాకెట్‌పై నిలువనీయవు. వర్షంలో తడిసినా ఒక్క చుక్క కూడా శరీరానికి తాకదు, వర్షాకాలానికి ఇవి పర్‌ఫెక్ట్‌ ఫిట్‌.


మాన్‌సూన్‌ షూస్‌
మనం కాజువల్‌గా వాడే లెదర్‌ షూ ఈ కాలానికి అంత పర్‌ఫెక్ట్‌ కాదు. వర్షంలో రోడ్లపై నిల్వ ఉన్న మట్టి షూకి అంటుకొని నడవడానికి అసౌకర్యంగా ఉంటుంది. ఇలాంటివి కాకుండా హైకింగ్‌ బూట్స్‌, రబ్బర్‌ షూస్‌ వంటివి వాడటం ద్వారా కాలానికి తగ్గట్టుగానే కాక ప్యాషన్‌గానూ ఉండవచ్చు. వీటి బయటిపొరకి సాగే గుణం ఉండటం వల్ల నీటిని నిలువనీయకుండా జారిపోయేలా చేస్తుంది.


చల్లగాలీ.. చిరు జల్లులతో రెయినీ సీజన్‌ వచ్చేసింది. కూల్‌ వాతావరణానికి సరిపడేలా వావ్‌ అనిపించే స్టైల్స్‌ ఏం ఫాలో అవుతున్నారు? ‘సమ్మర్‌లో కొన్ని సింపుల్‌ టీ-షర్టులు, షార్టులు ఉన్నాయ్‌ కదా!’ అంటే సరిపోదు. సీజన్‌కి తగ్గట్టు ట్రెండీగా కనిపించే ఫ్యాషన్స్‌ని ఫాలో అవ్వాల్సిందే. అందుకే ఇప్పటికి సరిపడే ట్రెండీవేర్‌లు, యాక్ససరీస్‌ మీ కోసం..


ఫోన్‌ సేఫ్టీ
ఫ్యాషన్‌తో పాటు..

కేవలం వర్షం నుంచి రక్షించుకోవడానికే కాకుండా ట్రెండీగా కనిపించేందుకు రకరకాల గొడుగులు అందుబాటులో ఉన్నాయి. పిల్లలకి కార్టూన్‌, మగవాళ్లకి¨ కార్డిలిక్‌ బైక్‌, జీన్స్‌, గన్‌ సైజిడ్‌.. మహిళలకు ఫ్లవర్‌ ఇవేకాక ప్రయాణానికి అనుకూలంగా బ్యాగ్‌లో ఇమిడే గొడుగులు మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి.


ఫోన్‌కీ సొగసులు


వర్షం పడదులే అనుకుంటాం. హఠాత్తుగా వర్షం వస్తుంది. మనకైతే సేఫ్టీకి జాకెట్‌లు, గొడుగులు ఉన్నాయి. మరి మన ఫోన్‌కి.. ఇప్పుడు మార్కెట్‌లో  ఫోన్‌కి కూడా వాటర్‌ ప్రూఫ్‌ పౌచ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. లేదా ఫోన్‌ తడవకుండా చిన్న పాటి వాటర్‌ప్రూఫ్‌ బ్యాగ్‌లను వాడొచ్చు.

 

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు