మరో ముస్తఫా!

ఎప్పుడో ప్రేమదేశం సినిమాలో ‘ముస్తఫా.. ముస్తఫా..’ అంటూ స్నేహంపై రెహమాన్‌ పాడితే ఇప్పటికీ మనం హమ్‌ చేస్తుంటాం. అదే తరహాలో ఆ మ్యూజిక్‌ మాంత్రికుడి కొడుకు ఏఆర్‌ అమీన్‌ ఈ తరాన్ని అలరించేస్తున్నాడు.

Published : 27 Jul 2019 00:35 IST

ప్పుడో ప్రేమదేశం సినిమాలో ‘ముస్తఫా.. ముస్తఫా..’ అంటూ స్నేహంపై రెహమాన్‌ పాడితే ఇప్పటికీ మనం హమ్‌ చేస్తుంటాం. అదే తరహాలో ఆ మ్యూజిక్‌ మాంత్రికుడి కొడుకు ఏఆర్‌ అమీన్‌ ఈ తరాన్ని అలరించేస్తున్నాడు. ‘సాగో.. ఎన్నోడువా!’ అంటూ ఆడి పాడుతూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకొన్నాడు. తన గాత్రం, హావభావాలతో తండ్రికి తగ్గ తనయుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు. తన తండ్రి ఓ గొప్ప మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనే కారణంతోనే ఈ రంగంలోకి రాలేదనీ, చిన్నప్పటి నుంచి మ్యూజిక్‌పై ఇష్టంతోనే పాడుతున్నానని ఈ టీనేజర్‌ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. రెహమాన్‌ కాన్సెర్ట్స్‌ టూర్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటూ మ్యూజిక్‌ ఓనమాలు దిద్దిన అమీన్‌కి మొదటిసారి వేదికపై పాడినప్పుడు సంగీతంలో ఉన్న కిక్‌ ఏంటో తెలిసిందట. తండ్రీ కొడుకుల మధ్య ఎక్కువగా ఆ ముచ్చట్లే. ‘కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన గ్యాడ్జెట్‌లనీ బాగా ఫాలో అవుతా. ఫొటోగ్రఫీ ఇష్టం. దునియాలో  వాస్తవాల్ని చూపగలిగే శక్తి ఫొటోగ్రఫీకి ఉందని నేనూ, నాన్న నమ్ముతాం’ అంటూ తన ఫిలాసఫీని చెబుతున్నాడు. ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్న అమీన్‌ చదువులోనూ చురుకేనట. చదువు తర్వాత మ్యూజిక్‌. ఇప్పటికైతే ఈ రెండిపైనే నా ఫోకస్‌ అని క్లారిటీతో పోతున్నాడీ  సెలెబ్రిటీ టీన్‌. నిజానికి తనకి స్టేజీపై పాడడం అంటే సిగ్గట. కానీ, ఒక పాట వెనుక ఎంత మంది కృషి ఉంటుందో తెలిసి తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందంటున్నాడు. అన్నట్టు.. తెలుగులో ’నిర్మలా కాన్వెంట్‌’ సినిమాలో పాడిన ‘కొత్త కొత్త భాష’ అనే పాటకి అవార్డు కూడా వచ్చింది అంటున్నాడు ఈ యువ సంగీత సంచలనం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని