స్వచ్ఛ ఆరోగ్య భారత్
... ఇదేదో ప్రధాని మోదీ పెట్టిన కొత్త పథకం కాదు. నేటితరం యువత ఫిట్‌నెస్ మంత్రా. దానికీ ప్లాగింగ్‌అని పేరు పెట్టేసి ఫాలో అయిపోతున్నారిప్పుడు. ‘చేతికి తీసుకొని’(ప్లోకా) ,.... ‘పరిగెత్తు’(జగ్గా) అని అర్థాలొచ్చే రెండు స్వీడన్ పదాల నుంచి పుట్టుకొచ్చిందీ ప్లాగింగ్ పదం.
జాగింగ్ చేస్తున్న వారెవరైనా ఉన్నట్టుండి రోడ్డు మీదకు వంగి అక్కడున్న చెత్తను తీసుకొని బ్యాగులో వేసుకోవడం చూశారా? ఇదేంటి ఇలా చేస్తున్నారని అనుకోకండి... అదే ఈ ప్లాగింగ్. అలా ఉద్యానవనాలు, అడవులు, రహదారులపై జాగింగ్ చేస్తూ... స్వచ్ఛభారత్ నిర్వహించడమే దీని ఉద్దేశం. ప్లాస్టిక్ కవర్లతో పాటు... చిత్తు కాగితాలను ఏరిపారేస్తున్నారు ప్లాగర్స్. దీనివల్ల ఎన్నో జంతువులకు, పక్షలకు ప్రాణాపాయం తప్పుతోందంటున్నారు. సాధారణంగా జాగింగ్ చేస్తే కరిగే కేలరీల(235)కన్నా... ఇలా ఎక్కువ కేలరీ(288)లు ఖర్చవుతున్నాయని చెబుతున్నారు ప్లాగర్స్. పరుగెత్తడం, పర్వతారోహణ ఇందులో భాగమేనంటున్నారు దిల్లీకి చెందిన ప్లాగర్ సుచీఖన్నా. చెత్త తీయడానికి నడుం వంచడం వల్ల పొట్ట కరగడంతో పాటు... వెన్నెముక బలపడుతుందని చెబుతున్నారు. గుండె పనితీరు మెరుగవుతుందంటున్నారు. విదేశాల్లో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు భారత యువతనూ కదిలిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
-
Movies News
IPL 2023: ఐపీఎల్ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే!
-
World News
Heartbreaking Story: మా అమ్మ కన్నీటితో డైరీలో అక్షరాలు తడిసిపోయాయి..!
-
World News
ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ మాయం..ఎయిర్టాగ్తో నిందితుడిని గుర్తించిన ప్రయాణికుడు