నా దేశమే దివ్యక్షేత్రం..

వివేకానందుడు లండన్‌ నగరం వదిలి వెళ్లే ముందు ఆంగ్లేయ మిత్రుడొకరు ఆయన్ని కలిసి.. ‘స్వామీజీ.. సర్వహంగులు, సకల సౌకర్యాలు గల పాశ్చాత్య దేశాల పర్యటనలో

Published : 12 Jan 2019 00:21 IST

నా దేశమే దివ్యక్షేత్రం..వివేకానందుడు లండన్‌ నగరం వదిలి వెళ్లే ముందు ఆంగ్లేయ మిత్రుడొకరు ఆయన్ని కలిసి.. ‘స్వామీజీ.. సర్వహంగులు, సకల సౌకర్యాలు గల పాశ్చాత్య దేశాల పర్యటనలో పొందిన అనుభవాల నేపథ్యంలో మీ మాతృదేశాన్ని ఎలా అంచనా వేస్తారు’ అని ప్రశ్నించగా.. దానికి స్వామీజీ సమాధానమిస్తూ.. ‘భారతదేశం నుంచి వచ్చేప్పుడు నా దేశాన్ని ప్రేమించాను. ఇప్పుడూ నా దేశపు దుమ్ము, ధూళీ, గాలి, సర్వస్వం నాకు పవిత్రమైనవే. ఎల్లప్పుడూ నా దేశాన్ని పునీతమైనదిగా, ఓ యాత్రాస్థలంగా, దివ్యక్షేత్రంగా భావిస్తూనే ఉంటాను’ అని సమాధానం ఇచ్చారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని