‘వెల్’వెట్
ఫ్యాషన్‌లో మరో ట్రెండ్ జోరందుకుంది. బ్లేజర్లు, జాకెట్లు కొత్తదనాన్ని అద్దుకున్నాయి. మెరుస్తూ మెప్పించాయి. ఎక్కడంటారా? ఇంకెక్కడ మన ఆస్కార్ వేడుకలో...! నటులు ధరించిన బ్లేజర్లు, జాకెట్లను చూసిన వారంతా ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఆక్వామెన్ హీరో జాన్సన్, కెప్టెన్ అమెరికా నటుడు చారిస్ వేసిన బ్లేజర్లు గమనించారా? ఆ గుర్తొచ్చింది కదూ! వెల్‌వెట్ బ్లేజర్లు. జాన్సన్ ఏమో పింక్ వెల్‌వెట్లో మెరిసిపోగా... లైట్ బ్లూ వెల్‌వెట్ జాకెట్లో చారిస్ ఆకట్టుకున్నాడు. ఇలా ఎక్కువ మంది వెల్‌వెట్ జాకెట్లు వేసుకొని వచ్చి కొత్త ట్రెండ్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. వెల్‌వెట్ వస్త్రంతో గతంలో మహిళలు బ్లౌజ్‌లు, షార్ట్ జాకెట్లు డిజైన్ చేయించుకునే వారు. ఇప్పుడు వెల్‌వెట్ పురుషులనూ ముంచెత్తింది. ఈ క్లాత్ నైట్ పార్టీలు, ఫంక్షన్లలో మనల్ని ప్రత్యేకంగా మెరిపిస్తుంది. అందుకే యువతా ఇదే బాటపడుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: గుజరాత్‌తో తొలి మ్యాచ్.. ధోనీ అందుబాటులో ఉంటాడా..? లేదా..?
-
Politics News
YS Sharmila: టీఎస్పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్
-
Crime News
Hyderabad: పని ఒత్తిడితో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
-
General News
Mekapati Chandrasekhar Reddy: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత
-
Movies News
Kajal: బాలీవుడ్లో నైతిక విలువలు లోపించాయి.. కాజల్ కీలక వ్యాఖ్యలు
-
Sports News
IPL 2023: ఆ జట్టుదే ఐపీఎల్ 16వ సీజన్ టైటిల్: మైకెల్ వాన్