ఈ దుస్తులకు తేడా లేదు

అబ్బాయిల దుస్తులు అమ్మాయిలు వేసుకోవడం చూశాం. అమ్మాయిల బట్టలు కొన్ని మార్పులతో కొందరు అబ్బాయిలు ధరించడం తెలుసు. అయితే ఇలా దుస్తుల్లో తేడాలెందుకు?

Updated : 27 Apr 2019 04:06 IST

బ్బాయిల దుస్తులు అమ్మాయిలు వేసుకోవడం చూశాం. అమ్మాయిల బట్టలు కొన్ని మార్పులతో కొందరు అబ్బాయిలు ధరించడం తెలుసు. అయితే ఇలా దుస్తుల్లో తేడాలెందుకు? అనే ప్రశ్న ఫ్యాషన్‌ డిజైనర్లలో మొదలైంది. ఫ్యాషన్‌ ప్రపంచంలో లింగవివక్ష ఉండకూడదని తలచారు డిజైనర్లు. అబ్బాయిలకు వేరేలా, అమ్మాయిలకు వేరేలా కాకుండా ఒకే రకమైన దుస్తులు తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. అమలు పరిచారు. ఇటీవల ముంబయిలో జరిగిన ఓ ఫ్యాషన్‌ షోలో ప్రముఖ డిజైనర్‌ సబ్యసాచి ముఖర్జీ అమ్మాయిలు, అబ్బాయిలకు పనికొచ్చే ఒకే విధమైన దుస్తులు రూపొందించి ప్రదర్శించారు. సోషల్‌ మీడియాలో వీటిని ముద్దుగా నోజెండర్‌ ఫ్యాషన్‌ అని యువత ట్రోల్‌ చేస్తున్నారు. ఇంతవరకూ అమ్మాయిలకే అనుకున్న డిజైన్లను అబ్బాయిలకూ అందించారు. సిల్క్‌ పైజామాలు, ఫిల్మ్సీ షర్ట్స్‌, కఫ్తాన్స్‌ వేసుకున్న మోడల్స్‌ ర్యాంప్‌పై నడిచి అందరినీ ఆకట్టుకున్నారు. లుక్‌, కంఫర్ట్‌, ట్రెండ్‌ దృష్టిలో ఉంచుకొని తయారు చేసిన ఈ దుస్తులు చర్చనీయాంశమయ్యాయి. ఫుల్‌ జాకెట్లు, ఫ్లవరీ డిజైన్‌ కుర్తాలు, షఫుల్‌ పైజామాలు యువతను కట్టిపడేస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు