సర్వం మీరైతే.. స్వరమే మిగిలేది!

విలువైన ఆలోచన.. తెలివైన టీమ్‌.. పుష్కలంగా పెట్టుబడులు.. అయినా అంకురం చిగురించదు! కారణం? అన్నీ మీరే అవ్వాలనుకోవడం! అంతా మీ కోణంలో నుంచి చూడడం!

Updated : 27 Apr 2019 04:04 IST

విలువైన ఆలోచన.. తెలివైన టీమ్‌.. పుష్కలంగా పెట్టుబడులు.. అయినా అంకురం చిగురించదు! కారణం? అన్నీ మీరే అవ్వాలనుకోవడం! అంతా మీ కోణంలో నుంచి చూడడం! ఎలా అంటారా?

రత్‌ కాలేజీ టాపర్‌.. వినూత్నమైన ఆలోచనలు చేస్తూ క్యాంపస్‌లోనే ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. అదే స్పీడుతో కాలేజీ నుంచి బయటికి వస్తూనే స్టార్టప్‌ ఆలోచన. చక్కని బృందంతో నెలల సమయంలోనే కంపెనీ పెట్టాడు. చదువుకునేటప్పుడు కష్టడినట్టుగానే పగలు, రాత్రి తేడా లేకుండా శ్రమించాడు. అన్నిచోట్లా తన స్వరమే వినిపిస్తుంది. తన మాటే హామీ అవుతుంది. అయినా.. ఫలితం ఆశించినట్టుగా రాలేదు. సర్వం తనే అయ్యాడు. చివరికి ఓటమిలోనూ తన స్వరమే వినిపిస్తుంది. ప్రయత్నంలో లోపం లేదనేది తన నమ్మకం. మరైతే, తప్పెక్కడ? చదువులో సూపర్‌ అనిపించుకున్న భరత్‌ స్టార్టప్‌ నిర్వహణలో ఎందుకు నెగ్గుకు రాలేకపోతున్నాడు? సింపుల్‌...

* అన్నీ తానై చేయడానికి స్టార్టప్‌ ఏమీ ఎగ్జామ్‌ కాదు. బృందంగా కలిసి వేసే సక్సెస్‌ దారి. అందరూ బాధ్యతగా పని చేస్తేనే గమ్యాన్ని చేరడం వీలవుతుంది. సాధించిన విజయంలో దారి పొడవునా అందరి పాదాలు కనబడితేనే అది సమష్టి కృషి.
నెట్స్‌.. గ్రౌండ్‌ ఒకటి కాదు:  కాలేజీల్లో టీన్స్‌ని చూసినప్పుడల్లా ఏదో తెలియని శక్తి పుట్టుకొస్తుంది. వారు చేస్తున్న ఆవిష్కరణల్ని చూస్తే ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ఎంతో దూరం లేదనిపిస్తుంది. మాటల్లో ఆత్మవిశ్వాసం నమ్మకం కలిగిస్తుంది. కానీ, వాస్తవాలు వేరుగా ఉన్నాయ్‌. ఎందుకిలా? అని ఆలోచిస్తే.. ‘సాధించిన డిగ్రీలు.. గెలుచుకున్న పతకాలు.. నాలుగు గోడల మధ్య నేర్చుకున్న వాటికి పరిమితం’ అనే విషయాన్ని గ్రహించలేకపోవడం. క్లాస్‌ రూమ్‌లో ఉన్నట్టుగానే మార్కెట్‌లోనూ ఉండాలనుకుంటే పోటీని తట్టుకోవడం కష్టం. మిలినీయిల్స్‌కి ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే.. ‘నెట్స్‌లో ఆడే ఆట.. గ్రౌండ్‌లో ఆడే ఆటకీ ఉన్న వ్యత్యాసాన్ని గమనిస్తూ ఇన్నింగ్స్‌ ఆడాలి. అప్పుడు టీమ్‌ గెలుస్తుంది’.

మీరు అందర్లో కనబడాలి: మీరు కంటున్న కలని బృందం చూస్తోందా? చూడాలంటే.. మీరే అందర్లో కనిపించాలి. అంటే.. బృందాన్ని నమ్మాలి. బాధ్యత అప్పగించాలి. అప్పుడే స్టార్టప్‌ ‘బ్రాంచి’లు చిగురించి ఓ వృక్షంలా మారుతుంది. అన్నీ మీరై ముందుకు నడిపించినంత కాలం వెదురు చెట్టులా నిటారుగా పెరగొచ్చుగానీ.. కొంత కాలానికి వంగి విరిగిపోతుంది. సంస్థ ఓ మర్రిచెట్టు అనుకుంటే.. బృందాన్ని ఊడల్లా మార్చేయాలి. అప్పుడే మార్కెట్‌లో మీరో ల్యాండ్‌ మార్క్‌లా మారేది.

మీదైన ‘కోడ్‌’: స్కూల్‌, కాలేజీల్లో యూనిఫామ్‌లో విద్యార్థుల్ని చూస్తే ఏమనిపిస్తుంది? గుంపుగా ఓ సమాజం సమానత్వంతో కనిపిస్తుంది. అదే మాదిరి బృందంగా కలిసి పని చేస్తున్నప్పుడు ఎవరు బాస్‌? ఎవరు ఉద్యోగులో తెలుసుకోగలిగే వ్యత్యాసం కనిపించొద్దు. అందుకు ప్రత్యేక డ్రస్‌ కోడ్‌ని ఫాలో అవ్వాలి.

- కోటిరెడ్టి సరిపల్లి, కేజీవీ గ్రూపు ఛైర్మన్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని