విజేతలు.. వీళ్లే

ఒకే పని.. కొందరు అలవోకగా చేసేస్తారు. ఇంకొందరు అసలు పూర్తి చేయలేరు. ఉద్యోగం ఒకటే.. కొందరు ఉన్నచోటే ఆగిపోతారు. ఇంకొందరు శిఖరం చేరతారు. ఎందుకిలా? విజేతల్లో ఉన్న ప్రత్యేకతలేంటి? అంటే..

Published : 09 Jul 2022 01:35 IST

ఒకే పని.. కొందరు అలవోకగా చేసేస్తారు. ఇంకొందరు అసలు పూర్తి చేయలేరు. ఉద్యోగం ఒకటే.. కొందరు ఉన్నచోటే ఆగిపోతారు. ఇంకొందరు శిఖరం చేరతారు. ఎందుకిలా? విజేతల్లో ఉన్న ప్రత్యేకతలేంటి? అంటే..

* ప్రతి పనిని ఒక ప్రణాళికా ప్రకారం విభజించుకుంటారు. క్రమం తప్పకుండా దాన్నే పాటిస్తారు.

* కెరీర్‌, వ్యాపారం ఏదైనా ఫలానా సమయానికి ఫలానాది సాధించాలనే స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పరచుకుంటారు.

* సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం.. సమయానికే పని ముగించి పడక ఎక్కడం.. వారి దినచర్య.

* మినిమలిజం పాటిస్తారు. మితంగా ఉంటూ, ఆడంబరాలను దూరం పెడతారు. సంపాదనలో కొంత మొత్తం పొదుపు, మదుపు చేస్తారు.

* కొత్త ఆలోచనలు వినడానికి ఎప్పుడూ సిద్ధమే. వాళ్లకు పనికొచ్చే, ప్రేరణగా నిలిచే స్నేహితులే ఉంటారు తప్ఫ. పని చెడగొట్టే వారిని దూరం పెడతారు.

* కెరీర్‌లాగే ఆరోగ్యానికీ ప్రాధాన్యం ఇస్తారు. వ్యాయామం, యోగా, ధ్యానం లాంటి మంచి అలవాట్లు ఉంటాయి.

* ఈ విజేతలకు పుస్తకాలు చదవడం తప్పనిసరి వ్యాపకం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని