Updated : 03 Sep 2022 04:33 IST

సుధామృతం.. యువ మంత్రం

స్ఫూర్తి కెరటం

అధ్యాపకురాలు, రచయిత్రి, దాత, రోల్‌మోడల్‌... ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తి గురించి ఎలాగైనా పరిచయం చేయొచ్చు. ఆమె జీవితం నుంచి యువత ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు.

* అణిగిమణిగి: ఇన్ఫోసిస్‌లో వాటాదారుగా సుధా వేల కోట్ల రూపాయలకు అధిపతి. కానీ ఎక్కడా ఆమె ఆ దర్పం ప్రదర్శించరు. ఓ పక్కింటి మాతృమూర్తిలాగే కనిపిస్తారు. ఆడంబరాలకు దూరంగా సాదాసీదాగా ఉంటారు. నలుగురితో మంచి అనిపించుకోవడమే అసలైన సంపాదన అంటారు.
* దార్శనికత: ఇన్ఫోసిస్‌ విజయంలో నారాయణమూర్తిది ఎంత కీలకపాత్రో.. దాన్ని నిలబెట్టడంలో సుధామూర్తికి అంతే ఘనత ఉంది. కంపెనీ ప్రారంభించినప్పుడు.. దాని భవిష్యత్తుపై నమ్మకంతో ఉన్నదంతా ఊడ్చి భర్తకిచ్చారు. ఆఖరికి నగలూ కుదువ పెట్టారు. మీరు గెలవగలరు అని భరోసా ఇచ్చారు. కుటుంబ బాధ్యతలు మోశారు.
* మనస్ఫూర్తిగా: మనసు చెప్పిందే ఆచరిస్తారు సుధామూర్తి. టాటా వాళ్ల ‘టెల్కో’లో ఉద్యోగ ఖాళీలున్నప్పుడు మహిళలు దరఖాస్తు చేసుకోకుండా నేరుగా చేరిపోవచ్చు అని ప్రకటించారు. ఇది మహిళలను చిన్నచూపు చూడటమే అని టాటాకి ధైర్యంగా లేఖ రాశారు. ఆ ఉద్యోగానికి తగినంత సమర్థత ఉందని నిరూపించుకునే చేరారు.
* తిరిగివ్వడం: సుధా, నారాయణమూర్తిలది మధ్యతరగతి కుటుంబం. ఎంతో కష్టపడి వేల కోట్లకు అధిపతి కాగలిగారు. అయినా సమాజం నుంచి తీసుకున్నప్పుడు తిరిగివ్వడం బాధ్యత అంటూ వేల కోట్ల రూపాయల దానధర్మాలు చేశారు. ఫౌండేషన్‌ నెలకొల్పారు.
* సమ ప్రాధాన్యం: న్ఫోసిస్‌లో కీలక పోస్టులో ఉన్నప్పుడు ఎంత సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించగలరో.. గృహిణిగా అంతే ఒడుపుగా గరిటె తిప్పగలరు సుధామూర్తి. వృత్తి, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేయడంలో ఆమెను అంతా రోల్‌మోడల్‌గా భావిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని