నమ్మకమే ఆయుధం
చదివింది పదోతరగతే. పెట్రోల్ బంక్‌లో పని చేసిన నేపథ్యం. అయినా ఆలోచనలు ఆకాశంలో ఉండేవి. వాటిని ఆచరణలో పెట్టారు. అలుపెరుగక శ్రమించారు. భారత వ్యాపారం దిగ్గజంగా ఎదిగారు. ఎందరో ఔత్సాహికులకు మార్గదర్శిగా మారారు. ఆయనే రిలయన్స్ వ్యవస్థాపకులు ధీరూభాయ్ అంబానీ. పలు సందర్భాల్లో ఆయన చెప్పిన స్ఫూర్తిదాయక మాటలివి.
* ఏ లక్ష్యాన్నీ తేలికగా వదలను. కడదాకా ప్రయత్నిస్తాను. గెలుస్తాననే నమ్మకమే నా ఆయుధం.
* గొప్ప ఆలోచనలు, ఆచరణలో మెరుపు వేగం.. ఇవే నా అస్త్రాలు. సృజనాత్మకత ఏ ఒక్కరి సొత్తూ కాదు.
* అవకాశాల్ని మనమే వేటాడాలి. అప్పుడు కీర్తి, సంపద మనల్ని వెతుక్కుంటూ వస్తాయి.రి పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు. పేదవాడిగా చనిపోవడం కచ్చితంగా నీ అసమర్థతే.
* అంకితభావం, శ్రద్ధతో పని చేస్తే విజయం నీ బానిస అవుతుంది.
* గడ్డు పరిస్థితుల్లోనూ లక్ష్యాలు వదలొద్దు. కష్టాలను అవకాశాలుగా మార్చుకోవాలి.
* యువతలో శక్తి అనంతం. వాళ్లకి సరైన పని వాతావరణం కల్పిస్తే, వెన్నంటి ప్రోత్సహిస్తే ఊహించని ఫలితాలు ఇస్తారు.
* నీ కలల్ని నీవు నిర్మించుకోకపోతే.. నీ కలలపై వేరొకరు నిచ్చెనలు వేసుకొని ఎదుగుతారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Chinese Billionaires: చలో సింగపూర్.. తరలి వెళుతున్న చైనా కుబేరులు!
-
World News
Malofeev: ఓ రష్యన్ సంపద.. ఉక్రెయిన్ సాయానికి.. అమెరికా కీలక నిర్ణయం!
-
India News
RSS- Adani group: ‘అదానీపై ఉద్దేశపూర్వక దాడి’.. అదానీ గ్రూప్‌నకు ఆరెస్సెస్ మద్దతు
-
Sports News
Suryakumar Yadav: హలో ఫ్రెండ్.. నీ కోసం ఎదురుచూస్తున్నా: సూర్యకుమార్ యాదవ్
-
Movies News
Vani jayaram: బీటౌన్ రాజకీయాలు చూడలేక మద్రాస్‌కు తిరిగి వచ్చేసిన వాణీ జయరాం
-
India News
Modi: మోదీనే మోస్ట్ పాపులర్.. బైడెన్, రిషి సునాక్ ఏ స్థానాల్లో ఉన్నారంటే..?