ఓరి దేవుడా.. ఇంత టాలెంటా?
పాటగత్తె.. ఆటగత్తె.. యూట్యూబర్.. డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్.. నటి.. చెప్పుకుంటూ పోతే మిథిలా పాల్కర్ జాబితా పెద్దదే. తెరంగేట్రం చేయడానికి ముందే అంతర్జాలంలో సంచలనమైన ఈ మరాఠీ మీఠీ ‘ఓరి దేవుడా’ అంటూ తెలుగు కుర్రాళ్లను పలకరిస్తోంది. ఈ సందర్భంగా ఆమె ముచ్చట్లు సంక్షిప్తంగా..
చిన్నప్పట్నుంచే: ఒక్కముక్కలో చెప్పాలంటే మిథిలా పుట్టు మేధావి. చిన్నప్పట్నుంచీ వసపిట్ట. క్లాసులో ఫస్ట్. క్విజ్, వక్తృత్వం, నృత్యం, పాడటం.. అన్నింట్లోనూ ముందే. ఏడో తరగతిలో ఉన్నప్పుడే ఇంటర్‌స్కూల్ డ్రామా కాంపిటీషన్లలో అదరొగొట్టింది. అప్పట్నుంచే నటనపై మోజు. పెద్దయ్యాక హిందుస్థానీ సంప్రదాయ సంగీతం నేర్చుకుంది. కథక్‌లో శిక్షణ తీసుకుంది. అక్క అమెరికాలో వైద్యురాలు. అక్కడికెళ్లి యాక్టింగ్ కోర్సు నేర్చుకుంది. ఇవన్నీ తెరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకోవడానికే.
తాత ఒప్పుకున్నాకే: కాలేజీలో ఉండగానే సినిమాల్లోకి వెళ్లి సత్తా ఏంటో నిరూపించుకుంటా అంది మిథిలా. ఇంట్లోవాళ్లూ ఒప్పుకోవాలిగా. ‘అవన్నీ కుదరవు. ముందు డిగ్రీ పూర్తిచెయ్. మంచి ఉద్యోగం సంపాదించు. ఒక నెల జీతం తీసుకొచ్చి చూపించు’ అన్నారు తాతయ్య. ఆయనంటే ప్రాణం. ఇక తప్పదనుకొని మాస్ మీడియా డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత తాతని ఒప్పించి ప్రయత్నాలు మళ్లీ షురూ చేసింది. 2014లో ‘మజా హనీమూన్’ అనే మరాఠీ లఘుచిత్రంతో ముఖానికి రంగేసుకుంది. ఇది ‘ముంబయి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ప్రదర్శితమైంది. ఆపై ‘కట్టీ బట్టీ’తో బాలీవుడ్లో అడుగు పెట్టింది. ఇందులో ఇమ్రాన్‌ఖాన్ చెల్లెలుగా నటించింది. తర్వాత మ్యాగీ, టాటా టీ, జొమాటా లాంటి కొన్ని కమర్షియల్ యాడ్స్‌లో నటించింది.
‘కప్ సాంగ్’తో టాప్: తెరంగేట్రం చేసి ఏడాదిన్నరైనా మిథిలాకి చెప్పుకోదగ్గ బ్రేక్ రాలేదు. అదేసమయంలో ఓరోజు ఫేమస్ మరాఠీ సాంగ్ ‘హీ చాల్ తురు తురు’ పాడుతూ.. దానికి అనుగుణంగా టేబుల్‌పై ఒక ప్లాస్టిక్ గ్లాసుని రెండు చేతులతో అటూఇటూ మారుస్తూ లయబద్ధంగా దరువేసింది. ఈ వీడియో రాత్రికి రాత్రే ఇంటర్నెట్లో వైరల్ అయింది. దాని తర్వాత తను నటించిన ‘న్యూస్దర్శన్’, ‘లిటిల్ థింగ్స్’, ‘గర్ల్ ఇన్ ద సిటీ’, ‘కార్వాన్’, ‘త్రిభంగ’ ‘అన్నాయింగ్ థింగ్స్ బాయ్‌ఫ్రెండ్స్ డూ..’ వెబ్‌సిరీస్‌లూ సూపర్‌హిట్ అయ్యాయి. తన నటన, ఎక్స్‌ప్రెషన్స్‌కి ఎంతోమంది ఫిదా అయ్యారు. తెలుగు హీరో రామ్‌చరణ్ సైతం ఆమె నటించిన ప్రతి వెబ్సిరీస్ని భార్య ఉపాసనతో కలిసి చూస్తానని ఈమధ్యే చెప్పాడు. ఈ గుర్తింపుతోనే తెలుగుదాకా వచ్చింది ముంబయి భామ.
విశేషాలు
గుర్తింపు: ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో చోటు
అవార్డు: మరాఠీ చిత్రం ‘మురంబా’కి ఫిలింఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూట్
కొత్తగా నచ్చుతోంది: హైదరాబాదీ ఫుడ్
అసలే నచ్చనిది: పదేపదే పక్కింటి అమ్మాయిలా ఉందనడం
పిచ్చి: రణ్‌బీర్ కపూర్ అంటే..
ఇష్టం: ప్రియాంకా చోప్రా, కాజోల్
అభిమాన క్రికెటర్: విరాట్ కోహ్లి
ఖాళీగా ఉంటే: పెంపుడు కుక్కలతో ఆడుకోవడం
మర్చిపోలేనిది: ఎన్ఐటీ సిల్చార్‌లో ఇచ్చిన టెడెక్స్ ప్రసంగం
క్రమం తప్పనిది: రోజూ వ్యాయామం చేయడం
ఇన్‌స్టా ఫాలోయర్లు: 32లక్షలు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
RVM: 2024 ఎన్నికల్లో ఆర్వీఎంల వినియోగంపై కేంద్రం క్లారిటీ
-
Movies News
Thalapathy 67: ఊహించని టైటిల్‌తో వచ్చిన విజయ్- లోకేశ్ కనగరాజ్ కాంబో
-
General News
Viveka murder case: సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని 6.30 గంటలపాటు ప్రశ్నించిన సీబీఐ
-
World News
Pakistan: పతనం అంచున పాక్.. 18 రోజులకే విదేశీ మారకపు నిల్వలు!
-
General News
Tarakaratna: తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంబ సభ్యులు: లక్ష్మీనారాయణ
-
India News
Supreme Court: భారత ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌లో సింగపూర్ సీజేఐ