Published : 29 Oct 2022 02:29 IST

శీతాకాలం.. వెచ్చందంగా

చలి జోరందుకుంది. కుర్ర మేను వెచ్చదనం కోరుతోంది. ఆ కోర్కె నెరవేరుస్తూ పనిలో పనిగా సొగసులు పరుగులు పెట్టించాలంటే.. ఈ ఔట్‌ఫిట్స్‌ ఉండాలంటున్నారు ఫ్యాషన్‌ గురూలు.
* ఓవర్‌కోటు: ఓవర్‌కోట్లు శరీరాన్ని కప్పేయడమే కాదు.. స్టైలిష్‌గానూ ఉంటాయి. ఇందులో ఊలువి వాడితే చలికి చెక్‌ పెట్టినట్టే. ఆధునికంగా ఉండాలనుకునే యూత్‌కి ‘హైపర్‌బీస్ట్‌’.
* మడతల డెనిమ్స్‌: డెనిమ్‌ జీన్స్‌ చలి నుంచి రక్షణనిస్తాయి. ఇందులోనూ మడతలవి మరింత దృఢంగా ఉంటాయి. సొగసు గురించి చెప్పనే అక్కర్లేదు.
* బీనీ టోపీలు: చలికాలంలో తలను కప్పేసుకోవడం ముఖ్యం. అందులోనూ చెవులను కవర్‌ చేసే బీనీ హ్యాట్లతో స్టైల్‌, రక్షణ రెండువిధాలా మేలు.
* లెదర్‌ బూట్లు: కాలేజీ కాంతలు, పడుచు కుర్రాళ్లు.. అందరికీ బూట్లపై మోజుంటుంది. ఆ అభిరుచి తీర్చుకుంటూనే చలిని పారదోలేవి లెదర్‌ బూట్లు.
* కేబుల్‌ నిట్‌ స్వెటర్‌: స్వెటర్‌ వాడకుండా చలికాలం ముగియదు. మనది కుర్రకారు గోల కాబట్టి అల్లికల కేబుల్‌ నిట్‌ రకానివైతే లోపల వెచ్చగా, స్టైల్‌ మెచ్చేలా ఉంటాయి.
* ఊలు సాక్సులు: పాదాలు పగలకుండా, చలి కాచుకునేలా ఉండాలంటే ఈ సీజన్‌లో సాక్సులు వేయడం మానొద్దు. అందులోనూ ఊలుతో చేసినవి ఉత్తమం. తరచూ బైక్‌పై దూసుకెళ్లే కుర్రకారుకి తప్పనిసరి.
* బాంబర్‌ జాకెట్‌: చలికాలంలోనూ సొగసుల వేడి పుట్టించాలంటే ఈ జాబితాలో బాంబర్‌ జాకెట్‌ని చేర్చాల్సిందే. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఇవి అందాన్ని రెట్టింపు చేస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు